* క్యాబిన్ చిక్కుకున్న లోకో పైలెట్
* 10 గంటలు శ్రమించి బయటికి తీసిన వైనం
ప్రజాపక్షం/హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ క్యాబిన్ చిక్కుకుపోయాడు. తీవ్ర గాయాలకు గురైన అతనికి క్యాబిన్ ప్రత్యేక పద్దతుల ద్వారా డాక్టర్లు చికిత్స అందించారు. సుమారు 10 గంటల పాటు సహాయ సిబ్బంది శ్రమించి ఎట్టకేలకు అతన్ని బయటికి తీశారు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరందర్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రెండు రైళ్ల వేగాలు కూడా తక్కువగా ఉండడంతో పెను ప్రభావం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. సిగ్నల్ వ్యవస్థ లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. లింగంపల్లి నుంచి ఫలక్ వెళ్తున్న ఎంఎంటిఎస్ రైలు (47178) మంగళవారం ఉదయం 10.30 గంలలకు కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్లాట్ నెంబర్ 2కు చేరుకుంది. అరనిముషానికే ఈ రైలు బయల్దేరింది. అదే సమయంలో లింగంపల్లి నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ కర్నూల్ ఇంటర్ ప్యాసింజర్ రైలు (17028) వస్తుంది. ఈ రెండు రైళ్లు కాచిగూడ రైల్వే స్టేషన్ 200 మీటర్ల దూరంలో ఒకే ట్రాక్ ఉండడంతో ఎదురెదురుగా రావడంతో ఢీ కొన్నాయి. ఎంఎంటిఎస్ రైలు కాచిగూడ స్టేషన్ వదిలి వెళ్తుండడం, కర్నూల్ ప్యాసింజర్ రైలు కాచిగూడ స్టేషన్ చేరుకుంటుండటం ఈ రెండు రైళ్లు ఒకే ట్రాక్ ఎదురెదురుగా ప్రయాణించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్ ఒకే ట్రాక్ తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. స్టేషన్ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు వెల్లడించారు.
ఢీకొన్న రైళ్లు
RELATED ARTICLES