HomeNewsBreaking Newsఢిల్లీపై బెంగళూరు విజయం!

ఢిల్లీపై బెంగళూరు విజయం!

రఫ్ఫాడించిన లోకల్‌ భాయ్‌

బెంగళూరు: ఐపిఎల్‌ 2023 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సిబి) మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత మరో విజయాన్నందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సిబి 23 పరుగుల తేడాతో గెలుపొందింది. విరాట్‌ కోహ్లీ(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. బౌలింగ్‌లో లోకల్‌ భాయ్‌ విజయ్‌ కుమార్‌(3/20) సత్తా చాటాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే మ్యాచ్‌ విన్నింగ్‌ పెర్ఫామెన్స్‌ చేశాడు. ఇది ఢిల్లీకి వరుసగా ఐదో పరాజయం కావడం గమనార్హం. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సిబి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ మినహా అంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ మార్ష్‌, కుల్దీప్‌ యాదవ్‌ రెండేసి వికెట్లు తీయగా.. లలిత్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ తీసారు. లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. మనీశ్‌ పాండే(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్‌ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్‌సిబి విజయ్‌ కుమార్‌ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. వ్యాన్‌ పార్నెల్‌, హసరంగా, హర్షల్‌ పటేల్‌ తలో వికెట్‌ తీసారు. టార్గెట్‌ చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాపార్డర్‌ తడబడింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే అనూజ్‌ రావత్‌ సెన్సేషనల్‌ ఫీల్డింగ్‌తో ఓపెనర్‌ పృథ్వీ షా(0) రనౌటవ్వగా.. రెండో ఓవర్‌లో మిచెల్‌ మార్ష్‌(0) వెనుదిరిగాడు. వ్యాన్‌ పార్నెల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. మూడో ఓవర్‌లో యశ్‌ ధూల్‌(1)ను సిరాజ్‌ ఔట్‌ చేయగా.. 6వ ఓవర్‌లో లోకల్‌ భాయ్‌ విజయ్‌ కుమార్‌.. కెప్టెన్‌ డేవి్‌డ వార్నర్‌(19)ను పెవిలియన్‌ చేర్చాడు. దాంతో ఢిల్లీ పవర్‌ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మనీశ్‌ పాండే, అభిషేక్‌ పోరెల్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ హర్షల్‌ పటేల్‌.. అభిషేక్‌ పోరెల్‌(5)ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌(21), మనీశ్‌ పాండే బౌండరీలతో ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడినా.. విజయ్‌ కుమార్‌ మరోసారి బ్రేక్‌ త్రూ అందించాడు. నకుల్‌ బాల్‌తో అక్షర్‌ పటేల్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. హసరంగా బౌలింగ్‌ భారీ షాట్లతో మనీశ్‌ పాండే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో ఢిల్లీ ఆశలు ఆవిరయ్యాయి. క్రీజులోకి వచ్చిన లలిత్‌ యాదవ్‌ను విజయ్‌ కుమార్‌ ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ ఆర్‌సిబి వైపు మళ్లింది. భారీ షాట్లతో అలరించిన అమన్‌ ఖాన్‌ను సిరాజ్‌ ఔట్‌ చేయగా.. అన్రిచ్‌ నోర్జ్‌ మరో వికెట్‌ పడకుండా ఇన్నింగ్స్‌ ముగించాడు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments