న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న వానల కారణంగా పలు ప్రాంతాలు జలమయంకాగా, ట్రాఫిక్ జామ్, విద్యుత్ సరఫరా నిలిపివేత వంటి సమస్యలతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. మరోవైపు రెండురోజులపాటు కుండపోత కారణంగా కేరళ కోలుకోలేని దెబ్బతిన్నది. భార త వాతావరణ శాఖ (ఐఎండి) ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటివరకూ కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో మొత్తం 26 మంది మృతి చెందినట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. చాలామంది గల్లంతయ్యారని, సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని పేర్కొంది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా పలు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు పడతాయని ఐఎండి ప్రకటించింది.ఉత్తరప్రదేశ్ (యుపి), హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షా లు పడవచ్చని తెలిపింది. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు
సూచించింది. ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలాశయాలుగా మారాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు రహదారులపై ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయగా, మరికొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలాయి. కొమ్మలు విరిగిపడ్డాయి. కేరళను వానలు ముంచెత్తుతున్నాయి. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పలక్కాడ్, మలప్పురం, కొజికోడ్, వయనాడ్ జిల్లాల్లో ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. విపత్తు నిర్వహణ బృందం రంగంలోకి దిగి, సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. విరిగిపడిన కొండ చరియలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరదనీటిలో పడి గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. భారీ వర్షాలు, వరద బాధితులను ఆదుకోవడానికి ఆయా జిల్లాల్లో మొత్తం 105 సహాయక శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వర్ష బీభత్సం ఎక్కువగా ఉన్న ఇడుక్కి, కొట్టా యం జిల్లాల్లో పరిస్థితి ఇప్పట్లో చక్కబడే అవకాశాలు కనిపించడం లేదు. కొట్టాయం జిల్లాలో తొమ్మిదిమంది మరణించగా, వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉండడంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్మీ, నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగాయి. విపత్తుల నిర్వహణ బృందాలతో కలిసి పనిచేస్తున్నాయి.
ఢిల్లీని కుదిపేసిన భారీ వర్షం
RELATED ARTICLES