ప్రజాపక్షం / హైదరాబాద్ : రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయశాఖ రైతులకు అందుబాటులోకి తెచ్చే పనిని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పంటలపై పురుగుల మందును మానవరహిత విధానం ద్వారా పిచికారి చేయడాన్ని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది. డ్రోన్‌ల ద్వారా పురుగుల మందు పిచికారి చేసే విధానాన్ని విశ్వవిద్యాలయంలోని పరిశోధనాక్షేత్రంలో సాగు చేస్తున్న వివిధ పంటలపై గురువారం ప్రయోగాత్మకంగా చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులను పిలిచి వారికి డ్రోన్‌ల ద్వారా పురుగుల మందు పిచికారి చేసే విధానాన్ని ప్రదర్శించారు. పని విధానాన్ని ఇక్కడి శాస్త్రవేత్తలు వారికి వి వరిస్తూ డ్రోన్‌ను ఉపయోగించి పురుగుల మందును పిచికారి చేయించారు. పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్న వ్యవసాయక్షేత్రాలకు ఇది చాలా ఉపయోగకకారిగా మారనుంది. అలాగే పంట సాగు మధ్య ఎడమ తక్కువగా ఉన్నప్పుడు వాటి మధ్య నడుస్తూ మందులు పిచికారి చే యలేనటువంటి గుబురుగుబురు పంటలకు పురుగు ఆ శిస్తే ఈ మందులను ఈ పద్ధతిలో పిచికారి చేసుకోవచ్చు. వీటన్నింటికంటే ముఖ్యమైనది పురుగుల మందు విషపూరితమైనది. పిచికారి చేసే సమమయంలో రైతు ఏ మా త్రం అజాగ్రత్తగా ఉన్నా… వాటిని పీల్చుకోవడం ద్వారా అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కో సారి రైతుల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. పైగా పిచికారి చేయడానికి సమయం కూడా ఎక్కువగా తీసుకుంటోంది. అంతే కాదు రైతు స్వయంగా పిచికారి చేయడం ద్వారా పంట మొత్తానికి కాకుండా కొంత భాగానికి పురుగుల మందు అందని పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. దీంతో పురుగుల మందు పిచికారి చేసినప్పటికి మందు తాకని ప్రాంతంలోని పురుగులు అలాగే ఉం డి, మళ్లీ ఆ పురుగు ఉదృతి పెరిగే అవకాశాలు ఉంటా యి. రిమోట్ ద్వారా డ్రోన్‌ను ఆపరేట్ చేస్తారు. డ్రోన్‌ల ద్వారా పురుగుల మందు పిచికారి చేస్తే ఈ సమస్యలేవి ఉండవు. పైగా పంట పై నుంచి పిచికారి చేయడం వల్ల పంట మొత్తానికి పురుగుల మందు అందుతుంది. రైతు లు పురుగుల మందు బారిన పడరు. పైగా తక్కువ సమయంలో ఎక్కువ పంటకు పురుగుల మందును పిచికారి చేయవచ్చు. అయితే ఒకే రైతు డ్రోన్ తెప్పించుకుని పురుగుమందులు పిచికారి చేసుకోవడం ఖర్చుతో కూడిన పని. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తోంది. రైతుల కు అవసరమైన ట్రాక్టర్లు, పురుగుల మందులు, పనిము ట్లు తక్కువ అద్దెపై ఇచ్చేందు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ వ్యవస్థను రైతు స మన్వయ సమితులు రైతులకు, సదరు సంస్థలకు మధ్య సంధానకర్తలుగా ఉండి చేయిస్తాయి. దీంతో ఒక గ్రా మంలోని కొంత మంది రైతులకు కలిపి పురుగుల మం దు పిచికారిని ఒకే రోజు ఏర్పాటుచేసుకుని డ్రోన్‌ను తెప్పించుకుని చేయించుకుంటే రైతుకు ఆరోగ్య భద్రతతో పాటు, పంటకు చక్కగా పురుగుల మందు పిచికారి చేయడం, తక్కువ సమయంలో పని పూర్తి కావడం, ఆ గ్రామంలోని పంట క్షేత్రాలన్నింటికి ఒకే సారి పురుగుల మందు పిచికారి చేయడం పూర్తవుతుంది. దీని వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. ఒక రైతు పురుగుల మందు పిచికారి ఒకసారి చేసుకోవడం, పక్కనే అదే పంట సాగు చేసే రైతు మరో సారి పిచికారి చేసుకోవడం వల్ల మొదట పిచికారి చేసుకున్న పంట పొలానికి పిచికారి చేసుకోని పక్క పంట పొలం నుంచి పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఈ సమస్యను కూడా రైతులు అధిగమించినట్లవుతోంది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయపరిశోధన కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో ‘ సెన్స్ ఏక ర్’ సంస్థ సహకారంతో డ్రోన్ ద్వారా పురుగుల మందు పిచికారి డెమాన్‌స్ట్రేషన్ నిర్వహించారు. దీని కోసం జిపిఎస్, జిఐఎస్ పరిజ్ఞానాన్ని వినియోగించారు. పంట ఎత్తును బట్టి ఎంత ఎత్తు నుంచి పిచికారి చేయాలి, ఎంత మోతాదులో పురుగుల మందు వాడాలి అన్న అంశాలను ఈ సంధర్భంగా పరిశీలించడమే కాకుండా దానిని శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం సంచాలకులు డాక్టర్. జగదీశ్వర్ , పరిశోధనా విభాగం హెడ్ డాక్టర్.ప్రదీప్ ప ర్యవేక్షణలో శాస్త్రవేత్తలు ఈ పిచికారి ప్రదర్శన నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు, పలువురు రైతులు ప్రదర్శన తిలకించారు.
డ్రోన్‌ల ద్వారా మందుల పిచికారి
RELATED ARTICLES