ముంబయి: భారత్ తొలిసారి డే/నైట్ టెస్టు ఆడటాన్ని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రశంసించారు. అభిమానులను ఆకర్షించేందుకు సుదీర్ఘ ఫార్మాట్లో ఇదో ముందడుగని అభివర్ణించారు. గులాబి బంతి టెస్టులో మంచు ప్రభావం ఉంటుందని ఆయన అంచనా వేశారు. ’డే/నైట్ టెస్టు భారత క్రికెట్లో శుభ పరిణామం. ఇదెలా సాగుతుందో తెలుసుకొనేందుకు చివరి వరకు వేచిచూడాలి. బహుశా మంచు ప్రభావం ఉండొచ్చు. అదెలా పనిచేస్తుందో తెలియదు. గులాబి మ్యాచులతో టెస్టు క్రికెట్‌కు మంచి జరుగుతుంది కాబట్టి పోరు సవ్యంగా సాగుతుందనే అనుకుంటున్నా. సుదీర్ఘ ఫార్మాట్ చూసేందుకు తిరిగి అభిమానులను స్టేడియాలకు తీసుకొచ్చేందుకు ఇలాంటి మార్పులు అవసరం. మంచు కారకం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు. ఏదేమైనప్పటికీ ఓ మంచి పనికోసం ముందడుగు వేయాల్సిందే. ఆస్ట్రేలియాలో గులాబి టెస్టులు ఎంత విజయవంతం అయ్యాయో మనం చూశాం. భారతీయులు కచ్చితంగా వీటిని ఆదరిస్తారనడంలో సందేహం లేదు. జనాలను తిరిగి స్టేడియంలో కూర్చుబెట్టేందుకు ఇదో మంచి బాట’ అని వెంగీ అన్నారు.
డే/నైట్ టెస్టునూ ఆదరిస్తారు
RELATED ARTICLES