హైదరాబాద్ : ఆస్ట్రేలియా 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ కారణంగా ఐసీసీ అప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అలాగే వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇద్దరిపై ఒక సంవత్సరం నిషేధం విధించింది. అయి తే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తరువాత స్మిత్‌కు వార్నర్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించలేదు ఆ స్ట్రేలియా. వారికి బదులుగా ఆరోన్‌ఫించ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. అయితే అప్పటివరకు ఐపీఎల్ కెప్టెన్‌గా ఉన్న స్మిత్ అలాగే వార్నర్‌కు ఆ సంబంధిత రాజస్థాన్ రాయల్స్ అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాం చైజీలు వారిని కెప్టెన్ పదవి నుంచి తప్పించాయి. అయితే సన్‌రైజర్స్‌కు వార్నర్ తరువాత ఆ పదవిని కేన్ విలియమ్సన్ చేపట్టాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సన్‌రైజర్స్ పగ్గాలు వార్నర్ అందుకోను న్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ను సన్‌రైజర్స్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వార్నర్ అభిమానులకు తెలియజేసాడు. అయితే ఈ వార్నర్‌సేన 2017 ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. అయితే చూడాలి మరి ఇప్పుడు 2020 ఐపీఎల్ ట్రోఫీని కూడా ఈ వార్నర్‌సేన ఎగరేసుకుపోతుందో.. లేదో చూడాలి.
డేవిడ్ వార్నర్‌కే సన్‌రైజర్ పగ్గాలు
RELATED ARTICLES