జర్నలిస్ట్ హత్యకేసులో మరో ముగ్గురికీ యావజ్జీవం
సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు
పంచకుల: తన సాయంత్రపు వార్తాపత్రిక ‘పూరా సచ్’లో అజ్ఞాత వ్యక్తి రాసిన ఉత్తరాన్ని ప్రచురించిన జర్నలిస్టు రామచందర్ ఛత్రపతి 2002లో చంపబడ్డాడు. డేరాబాబా అనుచరురాలు గురుమీత్ రామ్ రహీమ్ తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ ఆ లేఖ రాశారు. సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం సిర్సాకు చెం దిన డేరా సచ సౌద చీఫ్ రామ్ రహీమ్ సింగ్, మరి ముగ్గురికి జర్నలిస్టు రామచందర్ ఛత్రపతి హత్య కేసులో యావజ్జీవ ఖైదు శిక్షను విధించింది. కోర్టు ఇంకా వారికి ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానాను కూడా విధించిం ది. సిబిఐ కోర్టు జడ్జి జగదీప్ సింగ్ హత్య కేసు లో గతవారమే నిందితులైన గురుమీత్ రామ్ రహీం, నిర్మల్‌సింగ్, కుల్దీప్‌సింగ్, క్రిషన్ లాల్ ను దోషులని తీర్పు చెప్పారు. కోర్టు తీర్పు వెలువరచేప్పుడు నిందితులందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సిబిఐ న్యాయవాది నిందితులు నలుగురికి యావజ్జీవ శిక్ష, ఒక్కొక్కరికి రూ. 50,000 జరిమానా విధించినట్లు విలేకరులకు తెలిపారు. జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతిని ఆయన ఇంటి బయటనే ఐదుసార్లు తుపాకీతో కాల్చారు. కాగా అతడు గాయాలతో కొన్ని రోజులకే చనిపోయారు. భారత శిక్షా స్మృతి లోని సెక్షన్ 302(హత్య), 120బి (నేరపూరిత కుట్ర) కింద ఆ నలుగురి నిందితులను దోషులుగా తేల్చారు. నిర్మల్ సింగ్, క్రిషన్ లాల్‌ను సాయుధ చట్టం కింద దోషులుగా తేల్చారు.