కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
ఎస్‌సి విద్యార్థుల పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్స్ పథకానికీ ఓకె
న్యూఢిల్లీ : కేంద్రమంత్రివర్గం కొన్నికీలక నిర్ణయాలకు బుధవారంనాడు ఆమోదం తెలియజేసింది. డిటిహెచ్‌లోకి నూరుశాతం ఎఫ్‌డిఐ, షెడ్యూల్డు కులాల విద్యార్థులకు మెట్రిక్ అనంతర విద్యాభ్యాసానికకి 59,౦48 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దేశంలో డిటిహెచ్ (డైరెక్ట్ టు హోమ్) సేవలకు సంబంధించి ఇరవైయేళ్ళకు సరిపడ లైసెన్సులను జారీచేసేందుకు మార్గదర్శకసూత్రాలను కేంద్రమంత్రివర్గం బుధవారంనాడు సవరించింది. డిటిహెచ్ రంగంలో నూటికి నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్.డి.ఐ)ను కూడా అనుమతించేందుకు మార్గదర్శకసూత్రాల్లో మార్పులు చేసినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ చెప్పారు. డిటిహెచ్ రంగంలో నూరుశాతం ఎఫ్‌డిఐలను అనుమతించాలని వాణిజ్యమంత్రిత్వశాఖ కోరుతుండటంతో సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖలో ఈ మార్పులు అవసరమయ్యాయి. ఇప్పటివరకూ ఈ రంగంలో 49 శాతం పెట్టుబడులను మాత్రమే అనుమతిస్తున్నారు. ట్రాయ్ ని సంప్రదించిన తర్వాతే ఈ సవరణ చేసినట్లు జవదేకర్ చెప్పారు.
ఎస్‌సి విద్యార్థులకు 59 వేల కోట్లుషెడ్యూల్డు కులాల విద్యార్థులు మెట్రిక్ అనంతరం విద్యాభ్యాసం కొనసాగించడానికి వీలుగా 59,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సమకూరుస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్ళ కాలానికిగాను ఎస్‌సి విద్యార్థులకు ఇదెంతో ప్రయోజనకరంగా ఉం టుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తంలో 60 శాతం అంటే 35,534 వేల కోట్ల రూపాయలు కేంద్రం భరిస్తుంది. మిగిలిన మొత్తా న్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయాలి. ‘ఎస్‌సిల్లోని యువతరం విద్యార్థులు ఉన్నత చదువులు, నాణ్యతా ప్రమాణాలతో కూడిన చదువులు పొందగలుగుతారు. మన యువతరానికి అత్యున్నతమై నాణ్యతగల విద్య సమకూర్చడానికే తమ ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించింది’ అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.
ఎన్‌ఎఫ్‌డిసిలోకి నాలుగు యూనిట్ల విలీనం
ఫిలిమ్ డివిజన్, డైరెక్టొరేట్ ఆఫ్ ఫిలిమ్ ఫెస్టివల్స్, నేషనల్ ఫిలిమ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిలిమ్ సొసైటీలను ఎన్‌ఎఫ్‌డిసి (జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్)లో విలీనం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంకంటే మరింత సమన్వయంతో, ఎక్కువ సామర్ధ్యంతో ఈ విభాగాలు పనిచేసేందుకు, మానవ వనరులను, మౌలిక ప్రాతిపదిక సౌకర్యాలను పూర్తి సామర్థ్యంతో ఉపయోగించుకకునేందుకు వీలుగా ఈ నాలుగు యూనిట్లను ఎన్.ఎఫ్.డి.సి లో విలీనం చేసినట్లు ఒక ప్రకటన తెలియజేసింది.
ఢిల్లీలో అనధికార కాలనీలకు రక్షణ
ఢిల్లీలో అనధికార కాలనీల నిర్మాణాలపై శిక్షా చర్యలు చేపట్టకుండా మరో మూడేళ్ళు రక్షణ కల్పించేందుకు కేంద్రమంత్రివర్గం ఒక ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. వ్యవసాయ భూముల్లో అనధికార కాలనీలు, జె.జె. క్లస్టర్లు, ఢిల్లీ గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలునిర్మిస్తే శిక్షిలేకుండా ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. తొలుత 2011లో చేసిన ఎన్.సి.టి ఢిల్లీ (స్పెషల్ ప్రావిజన్) సవరణ చట్టం చేశారు. తర్వాత 2017లో చేసిన చట్టానికి కాలం తీరిపోతూండంతో దీనిని 2023 వరకు పొడిగిస్తూ పార్లమెంటు సమావేశాలు లేనందున ఈ ఆర్డినెన్స్ జారీ చేసినట్లు జవదేకర్ చెప్పారు. ఇది అమలులోకి రాకముందే రాష్ట్రపతి దీనిపై సంతకం చేస్తారని చెప్పారు.
ఆఫ్ఘన్‌తో గగనతల సేవల ఒప్పందానికి సవరణ
భారత్-, ఆఫ్ఘనిస్తాన్, ఫిలిప్పున్స్ మధ్య గగనతల సేవల ఒప్పందాల సవరణకు సంతకాలు చేయడానికి కేంద్రమంత్రివర్గం బుధవారంనాడు ఆమోదం తెలిపిది. ఒకదేశం గనుక ప్రయాణీకుల రాకపోకలకు విమానాలు నడపాలంటే, ద్వైపాక్షిక గగనతల సేవల ఒప్పందం చేసుకోవాలి. ఎన్ని విమానాలు నడపాలి, వారానికి ఎన్ని సర్వీసులు నడుపుతారు, ఎన్ని సీట్లు ఉంటాయి వంటి వివరాలన్నీ పొందుపరచాలి. భారత్‌తో ఈ రెండు దేశాలకు పౌర విమానయాన సర్వీసులు నిర్వహించడంలో ఎంతో ప్రాముఖ్యం ఉందని అధికార ప్రకటన తెలిపింది.
డిటిహెచ్‌లో 100 శాతం ఎఫ్‌డిఐ
RELATED ARTICLES