బిజెపికి విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని చూపడంలో కాంగ్రెస్ సహా లౌకిక, ప్రజాతంత్ర పక్షాల ఘోర వైఫల్యం
సిపిఐ జాతీయ కార్యవర్గం విమర్శ
జులై 19-21 తేదీల్లో పార్టీ జాతీయ సమితి సమావేశం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలకు విశ్వసనీయమైన ఐక్య ప్రతిపక్షాన్ని ప్రత్యామ్నాయంగా చూపడంలో కాంగ్రెస్‌పార్టీతో సహా లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఘోరంగా విఫలమయ్యాయని సిపిఐ జాతీయ కార్యవర్గం విమర్శించింది. తమిళనాడులో డిఎంకె ఎంతో ముందుచూపుతో వ్యవహరిం చి, వామపక్షాలతో సహా అన్ని లౌకిక, ప్రజాతంత్ర పార్టీలను కలుపుకొని, సహేతుకమైన రీతిలో వాటికి స్థానాలు కల్పించి సత్ఫలితాలు సాధించిందని అభిప్రాయపడింది. సిపిఐ జాతీ య కార్యవర్గ సమావేశం సోమ, మంగళవారాల్లో రెండు రోజులపాటు జరిగింది. ఎన్నికల ప్రచారం, ఫలితాలపై సుదీర్ఘ సమీక్ష జరిపిం ది. సిపిఐ తన సమాలోచనలను కొనసాగించే ప్రక్రియలో భాగంగా, జులై 19, 20, 21 తేదీల్లో మూడు రోజులపాటు న్యూఢిల్లీలో జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చే యాలని పార్టీ నిర్ణయించింది. ఈలోగా అన్ని రాష్ట్రాల పార్టీ సమితులు సమావేశాలు జరిపి, ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకోవాల్సింది గా కోరినట్లు సిపిఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
డిఎంకెను చూసి నేర్చుకోండి!
RELATED ARTICLES