వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా సూపర్ విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన సూపర్ న్యూజిలాండ్ తొలుత 13 పరుగులు చేసింది. అనంతరం భారత్ వికెట్ లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ ఓవర్‌లో కెఎల్ రెండు బంతులను ఒక సిక్స్, ఒక ఫోర్ బాది, మూడో బంతికి భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మిగతా పని పూర్తి చేసి జట్టును గెలిపించాడు. అంతకుముందు భారత్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ కూడా టైగా మారి సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఈ సందర్భంగా బుమ్రా సూపర్ ఓవర్‌లో ఒక వికెట్ 13 పరుగులిచ్చాడు. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ధాటిగా ఆడి జట్టును గెలిపించారు.ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 4-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఆ ఓవర్‌లో శార్దూల్ మాయ…
లక్ష్య ఛేదనలో కివీస్ 19 ఓవర్లలో 159/3తో పటిష్టస్థితిలో నిలిచి విజయానికి చేరువైంది. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు చేస్తే విజయం. అప్పటికే టిమ్ సీఫెర్ట్(57), రాస్ టేలర్(24) క్రీజులో పాతుకుపోయారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ సునాయాస విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే, శార్దూల్ ఠాకుర్ ఆ ఓవర్‌లో మాయ చేశాడు. తొలి బంతికి టేలర్‌ను బోల్తా కొట్టించాడు. తర్వాతి బంతికి డారిల్ మిచెల్ (4) ఒక బౌండరీ బాదాడు. మూడో బంతికి సీఫెర్ట్ రనౌటయ్యాడు. ఇక నాలుగో బంతికి శాంట్నర్ సింగిల్ తీయగా.. ఐదో బంతికి మిచెల్ ఔటయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా, శాంట్నర్ సింగిల్ తీశాడు. అవతలి వైపున్న బ్యాట్స్‌మన్ రెండో పరుగుకు యత్నించడంతో సంజు శాంసన్ త్రో విసిరి రనౌట్ దీంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఓపెనర్ గప్తిల్ (4) త్వరగా ఔటైనా కొలిన్ 47 బంతుల్లో 6×4, 3×6), టిమ్ సీఫెర్ట్(57; 39 బంతుల్లో 4×4, 3×6) ధాటిగా ఆడి కివీస్ వీరిద్దరూ రెండో వికెట్ 74 పరుగులు జోడించారు. అర్ధ శతకం తర్వాత ధాటిగా ఆడే క్రమంలో మన్రో రనౌటవ్వగా వెంటనే బ్రూస్ కూడా పెవిలియన్ చేరాడు. తర్వాత రాస్ టేలర్(24; 18 బంతుల్లో 2×4)తో జోడీ కట్టిన సీఫెర్ట్ గెలిపించినంత పనిచేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఇక చివరి ఓవర్‌లో కివీస్‌బ్యాట్స్‌మెన్ నలుగురు ఔటవ్వడంతో మ్యాచ్ మారింది.
ఆపద్బాంధవుడిలా మనీశ్…
టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగినటీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. మనీష్ పాండే (50నాటౌట్; 36 బంతుల్లో 3×4), కేఎల్ రాహుల్ (39; 26 బంతుల్లో 3×4, 2×6)రాణించారు. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన భారత్ ఒకానొక సందర్భంలో 88 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.సంజు శాంసన్ (8), కోహ్లీ (11), శ్రేయస్ అయ్యర్ (1), దూబే (12), సుందర్(0) విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే మనీశ్ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు. శార్దూల్ ధాటిగా ఆడారు. చివరి ఓవర్‌లో అర్ధ శతకం సాధించిన పాండే టీమ్‌ఇండియాకు స్కోర్ అందించాడు. బుధవారం ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20 కూడా సూపర్ ఓవర్‌కు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో షమి అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను టైగా ముగించాడు. తర్వాత సూపర్ ఓవర్‌లో రోహిత్ శర్మ చివరి రెండు బంతులను సిక్సులుగా మలిచి అద్భుత విజయాన్ని అందించాడు.
డబుల్ ‘సూపర్’
RELATED ARTICLES