అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటన నిమిత్తం సోమవారం గుజరాత్‌కు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు అహ్మదాబాద్ నగరం సంసిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ట్రంప్ రోడ్‌షోలో పాల్గొననున్నారు. క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ట్రంప్, మోడీ సంయుక్తంగా ప్రసంగించనున్నారు. కాగా, అధికారులు, భద్రతా సంస్థలు ఏర్పా ట్లకు సంబంధించి తుది మెరుగులు దిద్దు తున్నారు. రోడ్ షో సందర్భంగా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారా లేదా అనేది దానిపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆశ్రమం అధికారులు చెప్పారు. ట్రంప్, మెలానియా, ప్రధాని మోడీ సబర్మతి వాటర్ ఫ్రంట్‌ను వీక్షించి, సేదతీరేందుకు వీలుగా మూడు కుర్చీలను ఏర్పాటు చేశారు. ట్రంప్, మెలానియా ట్రంప్‌లకు చేతితో తయారు చేసిన ఖాదీ వస్తువులు, చరఖా, సావనీర్లు వంటి విలువైన వస్తువులను తమ ఆశ్రమం తరఫున బహుకరించనున్నట్టు ఆశ్రమం ప్రిజర్వేషన్ అండ్ మెమోరియల్ ట్రస్టు డైరెక్టర్ అతుల్ పాండ్యా తెలిపారు. హృదయ్ కుంజ్ వద్ద అతిథులను అలరిచేందుకు అతిపెద్ద పురాతన చరఖాను ఉంచనున్నారు. మహాత్మాగాంధీ నివసించిన రాథేకుంజ్‌ను కూడా సందర్శించాలని ట్రంప్ దంపతులను ఆశ్రమ ట్రస్టీలు కోరనున్నారు. దేశం స్వాతంత్య్ర ఉద్యమం సందర్భంగా మహాత్మాగాంధీ ఈ ఆశ్రమంలోనే బస చేసే వారు. షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్‌కు ఘనస్వాగతం పలికిన తరువాత అక్కడి నుంచి ట్రంప్, ప్రధాని మోడీ 22 కిలోమీటర్ల మేర రోడ్ షోగా బయలుదేరనున్నారు. రోడ్ షో అ నంతరం వారిద్దరు నగరగంలోని మొతెరా ప్రాంతంలో కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంను చేరుకుంటారు. అయితే రోడ్‌షోలో రోడ్డుకు ఇరువైపులా లక్షలాదిమంది ప్రజలు లైన్లలో ఉంటారని అధికారులుభావిస్తున్నారు.
ట్రంప్‌ను స్వాగతించేందుకు అహ్మదాబాద్ ముస్తాబు
RELATED ARTICLES