2020 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన స్టార్ షూటర్
న్యూ ఢిల్లీ: భారత మహిళా సీనియర్ స్టార్ షూటర్ తేజస్విని సావంత్ అందివచ్చిన అవకాశాలన్ని సద్వినియోగం చేసుకుని మొత్తానికి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.39 ఏళ్ల ఈ మహారాష్ట్ర షూటర్ తేజస్విని శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో 1171 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మందిలో ఆరుగురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో అందుబాటులో ఉన్న రెండు బెర్త్‌లలో ఒకటి భారత్‌కు, మరోటి జపాన్ (షివోరి)కు లభించాయి. తేజస్విని ఫైనల్లో 435.8 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. 2010లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా గుర్తింపు పొందిన తేజస్వినికి ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కలేదు. ఎన్నో గొప్ప ఆటలను ఆడి విజయాన్ని వరించారు . ఈసారి మాత్రం మిస్ అవ్వడం కొద్దిగా అందరిని నిరాశపరించింది .ఆమె ఒలింపిక్ కల ఈసారి సాకారం అవుతుంది అది కూడా ట్రయల్స్ లేకపోతే .. . తేజస్వినికి ట్రయల్స్ నిర్వహిస్తే అందులో నెగ్గాల్సి ఉంటుంది. భారత్ నుంచి ఇప్పటివరకు ఓవరాల్‌గా 12 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. తేజస్విని, కాజల్, గాయత్రిలతో కూడిన భారత బృందానికి 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం దక్కింది. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో గుర్‌ప్రీత్ సింగ్ 586 పాయింట్లతో రజతం నెగ్గగా… గుర్‌ప్రీత్, యోగేశ్, ఆదర్శ్‌లతో కూడిన భారత బృందం కాంస్యం గెలిచింది. వీరందరికి ఇలాంటి ఎన్నో విజయాల్ని భారత్ తరుపున సాధించాలని అభిమానులంతా అభినందనలను తెలియజేసారు .
టోక్యోకు తేజశ్విని
RELATED ARTICLES