పైలట్ సహా ఐదుగురూ మృతి
జలాంతర్గామి శకలాలు లభ్యం
యుఎస్ కోస్టుగార్డుల ప్రకటన
బోస్టన్: టైటానిక్ శకలాలు చూసేందుకు వెళ్ళిన ప్రపంచ కుబేరుల మినీ జలాంతర్గామి విచ్ఛిన్నమైపోయిందని, దాని శకలాలు కొన్ని లభ్యమయ్యాయని అమెరికా తీరప్రాంత గస్తీదళాధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ మినీ జలాంతర్గామిలో పైలట్ , ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సముద్ర అన్వేషకుడు, ఇప్పటివరకూ 37 సార్లు టైటానిక్ శకలాలను వెళ్ళి చూసి వచ్చిన పౌల్ హెన్రీ నార్జియోలెట్ (77), ఈ మినీ జలాంతర్గామి పైలట్, ఈ జలాంతర్గామి సంస్థ సహవ్యవస్థాపకులలో ఒకరు సిఇఓ స్టాక్‌టన్ రష్ (61), బ్రిటిష్ వ్యాపారవేత్త హమిష్ హార్డింగ్ (58), పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సంపన్నకుంటుబంలోని తండ్రీ కుమారులు షాహ్‌జదా దావూద్ (48), సులేమాన్ దావూద్ (19) మినీ జలాంతర్గామితో సహా విచ్ఛిన్నమయ్యారు. దీంతో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. ఈనెల 18వ తేదీ ఆదివారం మినీ జలాంతర్గామి బయలుదేరింది. రాడార్‌లోంచి అదృశ్యమైన కొద్దిసేపటికే టైటాన్ విచ్ఛిన్నమై ఉంటుందని ఆమెరికా రక్షణరంగ నిపుణులు అంచనావేశారు. 111 ఏళ్ళక్రితం ఉత్తర అట్లాంటిక్ సముద్రం లో మంచుపర్వతాన్ని ఢీకొని 12,500 అడుగుల లోతుల్లో సముద్రమట్టంలో సమాధి అయిపోయింది. టైటానిక్ రెండు ముక్కలుగా విరిగిపడి ఉన్న 1,600 అడుగుల దూరంలో (480 మీటర్లు) మినీ జలాంతర్గామి శకలాలను సముద్ర అన్వేషక రోబో కనుగొంది. ఓషన్‌గేట్ తోకభాగం, ఈ జలాంతర్గామి ల్యాండింగ్ కావడానికి ఉపయోగపడే కాళ్ళభాగాలు ముక్కలుగా పడిపోయి ఉండటాన్ని అన్వేషకులు మొదట గమనించి ఓషన్‌గేట్ విచ్ఛిన్నమైపోయిందని నిర్థారించుకున్నారు. ఫస్ట్ కోస్ట్‌గార్డ్ డిస్ట్రిక్ట్‌కు చెందిన అధికారి రీర్ ఆడ్మిరల్ జాన్ మౌగెర పాత్రికేయులతో మాట్లాడుతూ, తమ అన్వేషణ కొనసాగుతుందని, శకలాలకోసం గాలిస్తున్నామని చెప్పారు. సుమారు 96 గంటలకు సరిపడ ఆక్సిజన్ నిల్వలు అందులో ఉన్నాయి. ఈ ఆక్సిజన్ గురువారం వరకూ సరిపపోతుంది. ఆమెరికా, ఫ్రాన్స్ సహా సముద్రాన్వేషకులైన ఆర్మీ తన గాలింపు కొనసాగించింది. ఓషన్‌గేట్ లాంటి మినీ జలాంతర్గాముల ప్రైవేటు నిర్మాణ సంస్థలను అంత లోతైన సమద్ర యాత్రలలోకి ఏ విధంగా అనుమతిస్తారని, వాటికి ఎందుకు నియంత్రణలు లేవని ఇప్పుడు సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ మినీ జలాంతర్గామి ఓషన్‌గేట్ సహవ్యవస్థాపడు ఒకరు మాత్రం ఈ వాదలను తోసిపుచ్చారు. చాలా కఠినమైన పరీక్షలన్నీ పూర్తిచేసుకున్న తరువాతే ఓషన్‌గేట్‌ను లోతైన సముద్ర యాత్రలకు అనుమతించామని చెబుతున్నారు. ఓషన్‌గేట్ జలాంతర్గామి నిర్మాణ లోపాలను తప్పుబట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తమ జలాంతర్గామిలో ఎలాంటిలోపం లేదని ఆయన సమర్థించుకుంటున్నారు. ముఖ్యంగా 37 సార్లు ఇప్పటివరకూ టైటానిక్ శకలాలు సందర్శించి వచ్చిన సముద్ర అన్వేషకుడు నార్జియోలెట్‌కు సముద్రంలోని అనుపానులన్నీ చాలా క్షుణ్ణంగా తెలుసుననీ, సముద్రలోతులను ఆయన ప్రత్యక్షంగా చవిచూశారని పేర్కొంటూ స్నేహితులు, బంధువులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. ఆయన స్ఫూర్తితోనే సముద్రన అన్వేషకుడు, కెనడియన్ చిత్ర నిర్మాత జేమ్స్ కామెరూన్ 1997లో టైటానిక్ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘టైటానిక్’ చిత్రాన్ని ఉత్తర అట్లాంటిక్ సముద్ర గర్భంలో కుప్పకూలిపోయింది. 1912 ఏప్రిల్ 15వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో 75౦ మంది మినహా అందులో ప్రయాణించిన మిగిలిన 1500 మంది మరణించారు. రెండు ముక్కలుగా విరిగిపోయి 111 సంవత్సరాలుగాసముద్రగర్భంలో పడి ఉన్న టైటానిక్ ను చూసేందుకు టూరిజం వ్యవస్థను ఇటీవలికాలంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు ఈ సముద్రగర్భ టూరిజంకు చాలామంది అన్వేషకులు వెళ్ళివచ్చారు. వారిలో ప్రస్తుత ప్రమాదంలో మరణించిన పౌల్ హెన్రీ నార్జియోలెట్ ఎంతో ప్రముఖుడు. చాలా ఎక్కువసార్లు టైటానిక్ శకలాలను చూసివచ్చిన సముద్రగర్భ అన్వేషకుడుగా ఆయన ప్రఖ్యాతిగాంచారు
టైటాన్ విచ్ఛిన్నం

RELATED ARTICLES