వన్డేల్లో ఇంగ్లాండ్ టాప్
తాజా ర్యాంకిగ్స్‌ను విడుదలచేసిన ఐసిసి
దుబాయ్: ఐసిసి విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా టెస్టుల్లో నంబర్‌వన్‌గా నిలించింది. మరోవైపు వన్డేల్లో ఇంగ్లాండ్ జట్టు టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది. గురువారం ఐసిసి ప్రకటించిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ (113) పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రెండు పాయింట్ల తేడాతో న్యూజిలాండ్ (111) రెండో స్థానం దక్కించుకుంది. ఇక మూడో స్థానంలో సౌతాఫ్రికా (108), నాలుగో స్థానంలో ఇంగ్లాండ్ (105), ఐదో స్థానంలో ఆస్ట్రేలియా (98) టాప్ 5లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక (94), పాకిస్థాన్ (84), వెస్టిండీస్ (82), బంగ్లాదేశ్ (65), జింబాబ్వే (16) టాప్ చోటు దక్కించుకున్నాయి. ఈ నెల చివర్లో ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ సమరం జరగనుంది. దానికంటే ముందు ఐసిసి తాజాగా వార్షిక ర్యాంక్‌లను విడుదల చేసింది. వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచకప్‌కు అతిథ్యమివ్వనున్నా ఇంగ్లాండ్ జట్టు అగ్ర స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ మొత్తం (123) పాయింట్లతో నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. తర్వాత భారత్ (121) పాయింట్లతో రెండో ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. ఇక సౌతాఫ్రికా (115), న్యూజిలాండ్ (113), ఆస్ట్రేలియా (109), పాకిస్థాన్ (96), బంగ్లాదేశ్ (86), వెస్టిండీస్ (80), శ్రీలంక (76), అఫ్ఘనిస్థాన్ (64)లు వరుసగా టాప్ చోటు దక్కించుకున్నాయి.
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్
RELATED ARTICLES