ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలో మంగళవారం నుంచి జరగాల్సిన పది పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈనెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు నేటి వరకు పరీక్షలను వాయిదా వేసింది. అయితే లాక్‌డౌన్ దృష్ట్యా 31 నుంచి ఏప్రిల్ 6వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు రేపటి నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. పరీక్షల తేదీలను తర్వాత వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
హైకోర్టు ఆదేశం
పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, టెన్త్ బోర్డు ను హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం లాకౌట్ ప్రకటించిన తరుణంలో టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు ఎం ఎస్ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్ తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. టెన్త్ పరీక్షలు అన్నిటినీ వాయిదా వేయాలంటూ హైదరాబాద్ కు చెందిన బాలకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ను డివిజన్ బెంచ్ మరోసారి విచారించింది. టెన్త్ పరీక్షలు అన్నింటిని వాయిదా వేసుకుని విషయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని టెన్త్ పరీక్షలు ఎప్పుడు రీషెడ్యూల్ కూడా వెల్లడించాలని హైకోర్టు పేర్కొంది ఈ వ్యాజ్యాన్ని గతంలో విచారించినపుడు ఈనెల 30 వరకు టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది తిరిగి సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు రామచందర్ రావు నివాసంలో సమావేశమై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్వకేట్ జనరల్ తన ఇంటి నుంచి వాదనలు వినిపించారు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రతినిధి అడ్వకేట్ జనరల్ బి ఎస్ ప్రసాద్ హైకోర్టు ముందు ఉంచారు పరిశీలించిన హైకోర్టు పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది