మలుపు తిప్పిన శ్రేయస్ అయ్యర్
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిం ది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, జడేజా సత్తా చాట గా.. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ రాణించారు.
రఫ్ఫాడించిన జడేజా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇం గ్ల్‌ండ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైం ది. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/26), అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/53) మూడేసి వికెట్లు తీ యగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్ల్‌ండ బౌలర్లలో సకీబ్ మహ్మూద్(2/47), ఆదిల్ రషీద్(2/49) రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, జాకోబ్ బెతెల్ తలో వికెట్ పడగొట్టారు.
సూపర్ ఫీల్డింగ్‌తో ఫిల్ సాల్ట్‌ను రనౌట్ చేసిన శ్రేయస్ అయ్యర్.. బ్యాటింగ్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత దూకుడుగా ఆడి మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పాడు. ఇంగ్ల్‌ండ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్‌కు కలిసొచ్చింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం కటక్ వేదికగా జరగనుంది.
చెలరేగిన అయ్యర్, గిల్
అనంతరం అదే జోరు కొనసాగించిన అయ్యర్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ 14 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జాకోబ్ బెతెల్ విడదీసాడు. అయ్యర్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయ్యర్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో అతను 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.