సహాయక బృందానికి కూడా
రెండేళ్ల అంతర్జాతీయ అనుభవం, వయసు 60 ఏళ్లకు మించకూడదని నిబంధన
జులై 30 నాటికి చివరి తేదీ.
ముంబయి: టీమిండియా ప్రధాన కోచ్, సహాయక బృందానికి భారత క్రికెట్ బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ సారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలు విధించింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవం ఉండాలని, వయసు 60 ఏళ్లకు మించరాదని వెల్లడించింది. ప్రధాన కోచ్ సహా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌ను తిరిగి నియమించుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించింది. ‘ప్రస్తుతం భారత్‌కు కొనసాగుతున్న కోచింగ్ బృందానికి నియామకాల ప్రక్రియలో దరఖాస్తు చేసుకోకుండానే ప్రవేశం ఉంటుంది’ అని బీసీసీఐ ప్రకటించింది. రవిశాస్త్రిని కోచ్‌గా నియమించక ముందు 2017, జు లైలో కోచ్‌ల ఎంపికకు బిసిసిఐ తొమ్మిది మార్గదర్శకా లు నిర్దేశించింది. ఆ తర్వాత వాటిపై దృష్టి పెట్టలేదు. స్పష్టతనూ ఇవ్వలేదు. ఈ సారి అలా కాకుండా అన్ని పదవులకు కేవలం మూడు మార్గదర్శకాలనే నిర్దేశించారు. ప్రధాన కోచ్ అభ్యర్థికి టెస్టు హోదా కలిగిన దేశానికి కనీసం రెండేళ్లు లేదా అసోసియేట్ సభ్యదేశం/ ఏ-జట్టు/ఐపీఎల్ జట్టుకు మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. అలాగే కనీసం 30 టెస్టులు లే దా 50 వన్డేలు ఆడిన అనుభవం అవసరం. బ్యాటిం గ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకూ పై నిబంధనలే వర్తిస్తాయి. ఆడిన మ్యాచ్‌ల సంఖ్యను మాత్రం కుదించా రు. 10 టెస్టులు లేదా 25 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి. వయసు 60 దాటొద్దు. ప్రస్తుత ప్రధాన కో చ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌కు ప్రపంచకప్ ముగిసే నాటికి పదవీకాలం ముగిసింది. అయితే వెస్టిండీస్ పర్యటనను దృష్టిలో పెట్టుకొనిబిసిసిఐ 45 రోజుల గడువు పెంచింది. ఈ ము గ్గురూ తిరిగి సహాయక బృందంలో చేరే అవకాశం ఉంది. అయితే ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ శంకర్ బసు వెళ్లిపోవడంతో కొత్తవారిని నియమిస్తారని సమాచారం. ఇప్పుడు రవిశాస్త్రి వయసు 57 ఏళ్లు. మళ్లీ ఆయనను ఎంపిక చేస్తే 2023 ప్రపంచకప్ వరకు కొనసాగిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
టీమిండియా కొత్త కోచ్‌కు దరఖాస్తులు
RELATED ARTICLES