HomeNewsBreaking Newsటీమిండియాదే టి20 సిరీస్‌

టీమిండియాదే టి20 సిరీస్‌

చివరి మ్యాచ్‌లో ఆసీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపు
హైదరాబాద్‌:
ఆస్ట్రేలియాను చివరిదైన మూడో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్‌ టి20 సిరీస్‌ను 2 ఆధిక్యంతో గెల్చుకుంది. విజయానికి అవసరమైన 187 పరుగులను, మరొక్క బంతి మిలిగి ఉండగా, నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది. విరాట్‌ కోహ్లీ, సూర్య కుమార్‌ యాదవ్‌ అర్ధ శతకాలతో రాణించి, జట్టు తిరుగులేని విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌తో కలిసి ప్రారంభిచిన కామరాన్‌ గ్రీన్‌ వేగంగా పరుగులు రాబట్టాడు. ఆరు మంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసిన ఫించ్‌ని హార్దిక్‌ పాండ్య క్యాచ్‌ అందుకోగా అక్షర్‌ పటేల్‌ అవుట్‌ చేయడంతో 44 పరుగుల వద్ద ఆసీస్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. భారత బౌలర్లపై విరుచుకుపడి, కేవలం 21 బంతుల్లోనే, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52 పరుగులు సాధించిన గ్రీన్‌ ఇన్నింగ్స్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ తెరదించాడు. రాహుల్‌ క్యాచ్‌ పట్టడంతో గ్రీన్‌ పెవిలియన్‌ చేరాడు. హార్డ్‌ హిట్టర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కేవలం ఆరు పరుగులు చేసి రనౌట్‌కాగా, మాజీ కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌ 9 పరుగులకే వెనుదిరిగాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను టిమ్‌ డేవిడ్‌ తీసుకున్నాడు. జొష్‌ ఇంగ్లిస్‌ (24)తో కలిసి ఐదో వికెట్‌కు 31 పరుగులు జోడించాడు. మాథ్యూ వేడ్‌ ఒక పరుగు మాత్రమే చేసి, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం డానియల్‌ సామ్స్‌తో ఇలిసి ఏడో వికెట్‌కు కీలకమైన 68 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన డేవిడ్‌ 54 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు దొరికిపోయాడు. ఇన్నింగ్స్‌ ముగియడానికి అప్పటికి కేవలం మూడు బంతులు మాత్రమే మిలిగి ఉన్నాయి. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 186 పరుగులు సాధించగా, డానియల్‌ సామ్స్‌ (28), పాట్‌ కమిన్స్‌ పరుగుల ఖాతా తెరవకుండా క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేద్ర చాహల్‌, హర్షల్‌ పటేల్‌ తలా ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కేవలం 5 పరుగుల వద్ద డానియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌ క్యాచ్‌ అందుకోగా రాహుల్‌ (1) వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ శర్మ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 17 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద పాట కమిన్స్‌ బౌలింగ్‌లో డానియల్‌ సామ్స్‌కు చిక్కాడు. 30 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకున్న భారత్‌కు విరాట్‌ కోహ్లీ, సూర్య కుమార్‌ యాదవ్‌ అండగా నిలిచారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 104 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. 36 మంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, మరో ఐదు సిక్సర్లతో 69 పరుగులు సాధించిన సూర్య కుమార్‌ యాదవ్‌ను ఆరోన్‌ ఫించ్‌ క్యాచ్‌ పట్టగా జొస్‌ హాజెల్‌వుడ్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యతో కలిసి కోహ్లీ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. చివరి రెండో ఓవర్లలో విజయానికి 21 పరుగులు అవసంకాగా, 19వ ఓవర్‌ బౌల్‌ చేసిన డానియల్‌ సామ్స్‌ బౌలింగ్‌ మొదటి బంతిని కోహ్లీ సిక్స్‌గా మలిచాడు. అయితే ఆ తర్వాతి బంతికే ఫించ్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన అతను 48 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. చివరిలో హార్దిక్‌ పాండ్య (25 నాటౌట్‌), దినేష్‌ కార్తీక్‌ (1 నాటౌట్‌) జట్టును విజయ తీరానికి చేర్చారు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌:
20 ఓవర్లలో 7 విక్లెకు 186 (కామెరాన్‌ గ్రీన్‌ 52, జొష్‌ ఇంగ్లిస్‌ 24, టిమ్‌ డేవిడ్‌ 54, డానియల్‌ సామ్స్‌ 28 నాటౌట్‌, అక్షర్‌ పటేల్‌ 3/33).
భారత్‌ ఇన్నింగ్స్‌: 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 187 (విరాట్‌ కోహ్లీ 63, సూర్య కుమార్‌ యాదవ్‌ 69, హార్దిక్‌ పాండ్య 25 నాటౌట్‌, డానియల్‌ సామ్స్‌ 2/33).

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments