ముంబయి : బంగ్లాదేశ్‌తో అరుణ్‌జైట్లీ మైదానంలో జరిగే తొలి టీ20లో టీమిండియా క్రికెటర్లకు భద్రతను పెంచాలని దిల్లీ పోలీసులకు ఆదేశాలు అందాయట. సారథి విరాట్ కోహ్లీ సహా భారత క్రికెటర్లకు ఉగ్రముప్పు పొంచి ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి ఓ ఆకాశ రామన్న ఉత్తరం అందిందని తెలిసింది. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్‌షా, భాజపా సీనియర్ నేత అడ్వాణీ, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ పేర్లూ ఆ లేఖలో ఉన్నాయట. కేరళలోని కోళికోడ్ కేంద్రంగా పనిచేస్తున్న అఖిల భారత లష్కర్ ఉగ్రవాద సంస్థ పేరుతో వచ్చిన ఈ ఉత్తరాన్ని బీసీసీఐకి ఎన్‌ఐఏ పంపించిందట. ఈ ఉత్తరం నకిలీదేనని భావిస్తున్నప్పటికీ ఆటగాళ్ల భద్రతే పరమావధి కాబట్టి వారికి పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేయాలని దిల్లీ పోలీసులు భావిస్తున్నారు. నవంబర్ 3 నుంచి బంగ్లాదేశ్ పర్యటన మొదలవుతుంది. ఆదివారం అరుణ్‌జైట్లీ (కోట్లా) మైదానంలో తొలి టీ20 జరగనుంది. మిగతా రెండు టీ20లకు రాజ్‌కోట్, నాగ్‌పుర్ వేదికలు. ఇండోర్, కోల్‌కతాలో టెస్టులు నిర్వహిస్తారు.
టీమిండియాకు భద్రత పెంపు
RELATED ARTICLES