తొమ్మిది విమానాల్లో 56.5 లక్షల డోసులు రవాణా
హైదరాబాద్,విజయవాడ సహా తొలివిడత 13 నగరాలకు చేరిన కొవిషీల్డ్
ఎయిర్ ఇండియాలో 2.76 లక్షల డోసులు రవాణా
న్యూఢిల్లీ: పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఉత్ప త్తి స్థానం నుంచి కొవిషీల్డ్ టీకాను దేశంలో ఎంపిక చేసిన 13 నగరాలకు తరలించే ప్రకి య మంగళవారం నాడు మొదలైంది. దీంతో జనవరి 16 నుండి జాతీయ టీకా పంపిణీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైనట్లయింది. 1,300 కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా రు. మంగళవారం తెల్లవారుజామున వాక్సిన్ బాక్సులు మొదట ఢిల్లీకి బయలుదేరాయి. ఉదయం 10 గంటలకల్లా అవి ఢిల్లీలోని స్టోరే జీ కేంద్రాలకు చేరుకున్నాయి. టీకా తరలింపు ఆరంభమైందని కేంద్ర పౌరవిమాన యాన శాఖామంత్రి హరదీప్ సింగ్ పురి ట్విట్టర్ ద్వారా చెప్పారు. మూడు డిగ్రీల ఉష్ట్రోగ్రత వద్ద గల మూడు కంటైనర్లున్న ట్రక్కులకు మొదట పూజా కార్యక్రమం నిర్వహించారు. తర్వాత ఉదయం ఐదు గంటలకు టీకా ట్రక్కుల తరలింపునకు సీరం ఇనిస్టిట్యూట్ గేట్లు తెరచుకున్నాయి. విమానాశ్రయం నుండి నాలుగు విమానయాన సంస్థలకు చెందిన తొమ్మిది విమానాల్లో 56.5 లక్షల డోసుల కొవిషీల్డ్ టీకాను తొలివిడత వివిధ ప్రాంతాలకు తరలించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, బ్రిటిష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనికాలు తయారు చేసిన ఈ టీకాను పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. పుణె నుండి ఢిల్లీకి, చెన్నైకి స్పైస్‌జెట్, గో ఎయిర్ ఆపరేటర్లు మొదట వీటిని తరలించారు. ఢిల్లీకి 34 బాక్సులు తరలించినట్లు స్పైస్‌జెట్ ఛైర్మన్-ఎండి అజయ్ సింగ్ చెప్పారు. గువహటి(2.76 లక్షల డోసులు), కోల్‌కత (9.96 లక్షల డోసులు), హైదరాబాద్ (3.72 లక్షల డోసులు), భువనేశ్వర్ (4.80 లక్షల డోసులు), బెంగళూరు (6.48 లక్షల డోసులు), పాట్నా (5.52 లక్షల డోసులు), విజయవాడ (4.08 లక్షల డోసులు) నగరాలకు తమ విమానాల్లో టీకాను తరలించినట్లు ఆయన చెప్పారు. అమ్మదాబాద్‌కు రెండు లక్షల 76 వేల డోసుల టీకా బాక్సులు తరలించినట్టు ఎయిర్ ఇండియా పేర్కొంది. గో ఎయిర్ విమానంలో చెన్నైకి 70,800 డోసులు తరలించారు. భారత్ బయోటెక్ కూడా దేశీయంగా ఐసిఎంఆర్‌తో కలిసి కోవాగ్జిన్ టీకాను తయారు చేసింది. సోమవారంనాడు ప్రధానమంత్రి మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో, ప్రపంచంలోనే ఇది అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమంగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో ఒక్కనెలలో 2.50 కోట్ల మందికి టీకా వేస్తే,రాబోయే కొద్ది నెలల్లోనే 30 కోట్లమంది భారతీయులకు టీకా వేస్తామని ఆయన అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రానికి 3.64 లక్షల డోసుల కొవిషీల్డ్ టీకా పుణె నుండి అందింది. ఈ టీకాను 139 స్టోరేజీ కేంద్రాలకు తరలిస్తారని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకుడు జి.శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలోని 1213 కేంద్రాలలో 1400 కౌంటర్లు ఏర్పాటు చేసి టీకా పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో 3.10 లక్షల మంది ముందుపీఠిన నిలబడి సేవలు అదిస్తారని ఆయన చెపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
టీకా పంపిణీకి కౌంట్‌డౌన్ షురూ
RELATED ARTICLES