రాష్ట్రాలకు నేరుగా విక్రయించేందుకు ససేమిరా అంటున్న విదేశీ కంపెనీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకాలకు ఏర్పడిన కొరత ఇప్పట్లో తీరేదిగా కనిపించడం లేదు. దేశం లో ఉత్పత్తి అవుతున్న కొవిషీల్, కొవాగ్జిన్ సరఫ రా డిమాండ్‌కు ఏమాత్రం సరిపోవడం లేదు. దీని తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా పలు రాష్ట్రాల గ్లోబల్ టెండర్లను పిలిచాయి. కానీ, రాష్ట్రాలకు నేరుగా టీకాలను విక్రయించేందుకు విదేశీ కంపెనీలు ససేమిరా అంటున్న నేపథ్యంలో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్టే కనిపిస్తోంది. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వ్యాక్సిన్‌కు సంబంధించిన ఒప్పందాలను నేరుగా కేంద్రంతో నే కుదుర్చుకుంటామని, కాబట్టి రాష్ట్రాలకు నేరు గా వ్యాక్సిన్లు అమ్మే అవకాశం లేదని అమెరికా ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా స్పష్టం చేసినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మీడియాకు తెలిపారు. ఇంత కు ముందు పంజాబ్ రాష్ట్రానికి కూడా ఇలాంటి సమాధానమే వచ్చింది. ఇదే సూత్రాన్ని ఆ కంపెనీలు మిగతా రాష్ట్రాలకు కూడా అన్వయిస్తారనడం లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి, ప్రస్తుతానికి గ్లోబల్ టెండర్ల వల్ల చెప్పుకోదగ్గ ఫలితం ఉండదనే అనిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం నాలుగు కోట్ల వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ టెండర్ల ద్వారా కోటి డోసులు సేకరించాలని భావించింది. బిడ్ల గడువు జూన్ నాలుగో తేదీగా నిర్ధారించింది. ఆరు నెలల్లో 10మిలియన్ డోసులు పంపిణీ చేయాలని నిబంధన కూడా విధించింది. తెలంగాణలో ఇప్పటి వరకు 55 లక్షల 24 వేల 649 మందికి వ్యాక్సినేషన్ అం దింది. అందులో మొదటి డోస్ పూర్తున వారు 44 లక్షల 53 వేల 87 మంది. రెండో డోస్ పూర్తున వారు 10 లక్షల 71 వేల 562 మంది. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 79 లక్షల 175 మందికి వ్యాక్సినేషన్ పూ ర్తుంది. 55 లక్షల 55 వేల 720 మందికి మొదటి డోస్ అందగా.. 23 లక్షల 44 వేల 455 మందికి రెండో డోస్ కూడా పూర్తుంది. ప్రస్తుతం టీకాల కొరత కారణంగా ఉనయ తెలుగు రాష్ట్రాల్లో మొదటి డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం ఐదు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి. రాష్ట్రాలు పిలిచిన టెండర్లలో చాలా కంపెనీలు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే మోడెర్నా, ఫైజర్ కంపెనీలు రాష్ట్రాలకు ఊహించిన షాకిచ్చాయి. వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని భావించిన రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లాయి. మోడీ సర్కారుతోనే ఒప్పందం చేసుకుంటామని ఫైజర్, మొడర్నా కంపెనీలు తేల్చిచెప్పిన నేపథ్యంలో, ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం ఆవరణలోకి చేరింది. వ్యాక్సినేషన్‌పై దాదాపు చేతులెత్తేసినట్టు కనిపిస్తున్న మోడీ ప్రభుత్వం ఎంత వరకూ రాష్ట్రాల సమస్యను తీరుస్తుందనేది అనుమానంగానే ఉంది.
సమస్య ఏమిటి?
టీకాలను రాష్ట్రాలకు అమ్మకుండా, కేంద్ర ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకుంటామని ఫైజర్, మొడర్నా ఫార్మా కంపెనీలు ఎందుకు స్పష్టం చేశాయి? టీకాలను రాష్ట్రాలకు అమ్మితే సమస్య ఏమిటి? ఈ ప్రశ్నకు ఫైజర్ ఇది వరకే తన వివరణ ఇచ్చింది. టీకా వేయించుకున్న వారిలో ఎవరైనా చనిపోయినా లేదా ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్నా, వారు కోర్టులకు వెళ్లే అవకాశం లేకపోలేదని ఫైజర్ అనుమానం. భారత్‌లో నమోదయ్యే కోర్టు కేసులతో తమకు ఎలాంటి సంబంధం ఉండకూడదనేది ఫైజర్ అభిప్రాయం. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రానికి ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఏ కంపెనీ టీకాతో సమస్య తలెత్తుతుందో, కోర్టు కేసులు నమోదవుతాయో, వాటికి ఆయా కంపెనీలే బాధ్యత వహించాలన్నది కేంద్ర సర్కారు ఆలోచన. అందుకే సుమారు నెలన్నర క్రితమే ఫైజర్ చేసుకున్న అనుమతిపై ఇంకా మోడీ సర్కారు నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడు తీసుకుంటుందనే విషయంపై స్పష్టత కూడా లేదు. దీనితో వ్యాక్సిన్ల కోసం పదికిపైగా రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నం, గ్లోబల్ టెండర్ల ప్రక్రియ దారుణంగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. టీకాల కొరత ఎప్పుడు తీరుతుందనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. మరోవైపు, దేశంలో భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ద్వారా ఉత్పత్తి అవుతున్న కొవిషీల్‌తోపాటు రష్యాకు చెందిన స్పుత్తినక్ ‘వి’కి మాత్రమే భారత ఔషధ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూడు తప్ప మరో కంపెనీ గ్లోబల్ టెండర్లలో పాల్గొనే అవకాశం లేదు. గ్లోబల్ టెండర్ల ప్రక్రియకు ఇది కూడా అవరోధంగా మారింది. టీకా దుష్ప్రభావంతో మరణించిన వారికి ఇచ్చే పరిహారం విషయంలో తమకు కేంద్ర ప్రభుత్వం నుంచే భద్రత కల్పించాలని ఫైజర్ మాదిరిగానే మిగతా దేశాల ఫార్మా కంపెనీలు డిమాండ్ చేయడం ఖాయంగాకనిపిస్తున్నది. అయితే, దేశంలో ఇప్పటిదాకా ఏ సంస్థకూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి న్యాయపరమైన భద్రతను ఇవ్వలేదు. అలాంటిప్పుడు ఇప్పుడు కొత్తగా ఫైజర్, మొడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీలకు న్యాయ భద్రతను కల్పిస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు తిప్పలు తప్పేలాలేవు.
టీకా కొరత తీరేనా?
RELATED ARTICLES