కోటి టీకాలకు కేంద్రం ఆర్డర్
న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 టీకా ‘కోవీషీల్డ్’ ను కొనుగోలు చేసేందుకు కేంద్రం పర్చేజ్ ఆర్డర్‌ను విడుదల చేసింది. కోటీ పది లక్షల టీకా ల కొనుగోలుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)కి పర్చేజ్ ఆర్డర్‌ను పం పింది. ఈ టీకా ధర జీఎస్‌టీతోసహా 210 రూపాయలని ఉన్నతాధికారి ఒకరు పిటిఐతో మాట్లాడుతూ చెప్పారు. టీకా వాస్తవ ధర 200 రూపాయలుకాగా, జీఎస్‌టీతో కలిసి 210 రూపాయలకు చేరిందని తెలిపారు. ఎస్‌ఐఐ ద్వారా కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ పేరుమీద, ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఈ టీకాలను సరఫరా చేస్తుంది. దేశంలో ఎంపిక చేసిన 60 కేంద్రాలకు తొలుత కోవీషీల్డ్ టీకాను పంపుతారు. ఆతర్వాత మిగతా ప్రాం తాలను కూడా చేరుస్తారు. దేశ వ్యాప్తంగా ఈ టీకా లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కోటీ పది లక్షల టీకాలు మొదటి విడత కొనుగోలు మాత్రమేనని, త్వరలో మళ్లీ ఆర్డర్ చేస్తామని వివరించారు. భారత్ బయోటెక్, ఎస్‌ఐఐ సంయుక్తంగా కోవీషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈనెల 16న కోవిడ్‌కు టీకా కార్యక్రమం మొదలుకానున్న విషయం తెలిసిందే.
టీకాధర రూ. 210
RELATED ARTICLES