16 జట్లతో కూడిన షెడ్యూల్‌ను తయారుచేసిన ఐసిసి
దుబాయి : వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. క్వాలిఫయిర్ టోర్నీకి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు ఇటీవలే ముగియడంతో టీ20 వరల్డ్‌ప్ షెడ్యూల్‌పై స్పష్టత వచ్చింది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి. క్వాలిఫయిర్ టోర్నీలో పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ వంటి చిన్న జట్లు అర్హత సాధించడంతో ఐసీసీ వినూత్నంగా షెడ్యూల్‌ను రూపొందించింది. చిన్న జట్లను ఏ, బీ అనే రెండు గ్రూపులుగా విభజించింది. టాప్-10 పది జట్లలో ఉన్న రెండు పెద్ద జట్లను ఈ రెండు గ్రూపుల్లో చేర్చింది. గ్రూప్-ఏలో శ్రీలంకతో పాటు పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌ో్త పాటు గ్రూప్-బీలో నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ ఉంటాయి. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి. సూపర్-12లో ఉన్న జట్లను గ్రూప్-1, గ్రూప్-2గా విభజించారు.
సూపర్-12లో..
గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు సూపర్-12లో గ్రూప్-1లో చేరతాయి. ఈ గ్రూపులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. ఇక గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు సూపర్-12లో గ్రూప్-2లో చేరతాయి. ఈ గ్రూపులో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. రెండో మ్యాచ్‌లో 29న క్వాలిఫయింగ్ జట్టుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ మ్యాచ్‌లు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 8 వరకు జరగనుండగా.. సెమీఫైనల్స్ నవంబర్ 11, 12 తేదీల్లో జరుగుతాయి. నవంబర్ 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్ నిర్వహిస్తారు.
టి20 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల
RELATED ARTICLES