హైదరాబాద్: ప‌్రజాకూటమిలో భాగస్వామి తెలంగాణ జనసమితి (టిజెఎస్) తమ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలను రేపు ప్రకటిస్తామని ఆ పార్టీ తెలిపింది. టిజెఎస్ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌కు మల్కాజ్‌గిరి స్థానాన్ని కేటాయించారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ 94, టిడిపి 14, టిజెఎస్ 8, సీపీఐ 3 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి.
టిజెఎస్ ప్రకటించిన అభ్యర్థులు వీరే..
1. మల్కాజ్‌గిరి- కపిలవాయి దిలీప్‌కుమార్
2. దుబ్బాక- రాజ్‌కుమార్
3. సిద్దిపేట- భవానీరెడ్డి
4. మెదక్- జనార్దన్‌రెడ్డి