ఆర్‌టిఐ చట్ట సవరణకు టిఆర్‌ఎస్ మద్దతే వారి బంధానికి అద్దం పడుతోంది : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రంలో టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య డూప్ ఫైట్ నడుస్తున్నదని టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించా రు. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే చట్టసవరణకు టిఆర్‌ఎస్ ఎంపి లు మద్దతు పలకడమే ఆ రెండుపార్టీల బం ధానికి అద్దం పడుతోందన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియా తో చిట్ చాట్ చేశారు. అనంతరం మీడి యా సమావేశంలో మాట్లాడారు. దేశం లో బిజెపి పాలనను పోలీస్ రాజ్యంగా మారుస్తున్నారని అన్నారు. మాజీ ఎంపి వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే విషయం తనకు తెలియదని, కేవలం పాత మిత్రునిగానే తాను ఆయన ఇంటికి వెళ్లి కలిశానన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని, వచ్చేసారి అధికారం తమదేనని చెప్పారు. బిజెపి కేవలం అర్బన్ పార్టీ మాత్రమేనని, ఆ పార్టీ ఊపు అనేది కేవలం మీడియా సృష్టే తప్ప ప్రజల్లో లేదన్నారు. తెలంగాణలో బిజెపి మతతత్వ రాజకీయాలు నడవవని చెప్పారు. మున్సిపాలిటీలపై హక్కులను కలెక్టర్లకు కట్టబెట్టడం దారుణమని, ఇది చట్టపరంగా నిలబడదని, దీన్ని కోర్టులో సవాల్ చేస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇది సిఎం కెసిఆర్ నిరంకుశత్వానికి నిదర్శనమని, గతంలో హరితహారం ఫెయిల్ అయినందుకు కెసిఆర్ లేదా మంత్రులు రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. వారికి వర్తించనిది, 85 శాతం మొక్కలు లేకపోతే కౌన్సిలర్‌ల పదవి రద్దు చేసే విధంగా మున్సిపాలిటీ చట్టం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని మరో వారం రోజులు కొనసాగిస్తున్నామన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సమాయత్తపరుస్తున్నామని తెలిపారు.