బిజెఎల్పి మాజీ నేత కిషన్రెడ్డి
హైదరాబాద్ : టిఆర్ఎస్ ప్రకటించిన ప్రస్తుత ఎన్నికల మెనిఫెస్టో గత ఎన్నికల మేనిఫెస్టో కంటే పేజీలు తగ్గాయని, హామీలు కూడా తగ్గాయని, ఈ రెండు తగ్గినట్టే.. ఈసారి ఎన్నికల్లో టిఆర్ఎస్కు సీట్లు కూడా తగ్గుతాయని బిజెఎల్పి మాజీ నేత జి.కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేర్కొనే జయశంకర్ ఫొటో గత మెనిఫెస్టోపై ఉండగా ఈసారి ఆ ఫొటోను కూడా తొలగించారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు అమలు చేయలేదని, ఈ కారణంగా టిఆర్ఎస్ తన విశ్వనీయతను కోల్పోయిందని తెలిపారు. ప్రజలు టిఆర్ఎస్ మాటలను నమ్మే పరిస్థితి లేరని చెప్పారు. టిఆర్ఎస్ తాజా మెనిఫెస్టోలోని హామీలపై చేస్తాము చూస్తామనడమే తప్ప స్పష్టత లేదని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు.
టిఆర్ఎస్కు సీట్లు కూడా తగ్గుతాయ్
RELATED ARTICLES