ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటన
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక, బ్యక్తిగత బ్యాటింగ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు టాప్ టెన్‌లో నిలిచారు. బ్యాటింగ్‌ల నయావాల్ చటేశ్వర్ పుజారా మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక, విరాట్ కోహ్లి 922 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే రెండో స్థానంలో ఉన్న విలియమ్సన్‌తో కోహ్లికి ప్రమాదం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రస్తుతం 9 పాయింట్ల అంతరమే ఉంది. విలియమ్సన్ 913 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లి టాప్ ర్యాంక్‌కు ముప్పు తప్పెలా లేదు. రానున్న వెస్టిండీస్ సిరీస్‌లో మెరుగ్గా రాణించి మరిన్ని పాయింట్లు సాధిస్తేనే కోహ్లి ర్యాంక్‌కు ఢోకా లేకుండా ఉంటుంది. మరోవైపు రానున్న యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల నుంచి కూడా కోహ్లి టాప్ ర్యాంక్‌కు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మళ్లీ జాతీయ జట్టులో రావడంతో కోహ్లికి గట్టి పోటీ నెలకొంది. డేవిడ్ వార్నర్, స్మిత్‌లపై నిషేధం విధించడంతో ఇద్దరు ఏడాది పాటు ఆస్ట్రేలియా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో కోహ్లి ర్యాంక్‌కు ఎదురు లేకుండా పోయింది. మరోవైపు యాషెస్‌లో రాణిస్తే స్మిత్, వార్నర్‌లు మళ్లీ టాప్ రావడం తథ్యం. అంతేగాక పుజారా ప్రస్తుతం 881 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అతని నుంచి కూడా కోహ్లికి పోటీ తప్పెలా లేదు. ప్రస్తుతానికి అయితే ఒక్క విలియమ్సన్‌తోనే కోహ్లి టాప్ ర్యాంక్‌కు ప్రమాదం పొంచి ఉంది. భవిష్యత్తులో మాత్రం ఇతర ఆటగాళ్లు కూడా రేసులోకి రావడం ఖాయం. అప్పుడూ దీన్ని నిలబెట్టుకోవడం విరాట్‌కు అనుకున్నంత తేలిక కాదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లు టాప్ టెన్‌లో కొనసాగుతున్నారు. జడేజా ప్రస్తుతం ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ సిరీస్‌లో రాణించడం ద్వారా తమ ర్యాంక్‌లను మరింత పెంచుకోవాలని భారత బౌలర్లు భావిస్తున్నారు. ఇక, ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ పాట్ కమిన్స్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇటీవల కాలంలో కమిన్స్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. రానున్న యాషెస్ సిరీస్‌లో మరింత మెరుగైన ప్రదర్శనతో టాప్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు ఇంగ్లండ్ స్టార్ బౌలర్ అండర్సన్ ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇతను కూడా టాప్ ర్యాంక్‌పై కన్నేశాడు. యాషెస్‌లో రాణించడం ద్వారా టాప్ ర్యాంక్‌ను అందుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తున్నాడు. దక్షిణాఫ్రికా సంచలనం కగిసో రబడా మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఇతను కూడా ర్యాంక్‌ను మెరుగు పరుచుకోవాలని తహతహలాడుతున్నాడు. ఆల్‌రౌండర్లు జాబితాలో వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అగ్రస్థానంలో నిలిచాడు. కొంతకాలంగా ఇటు బ్యాట్‌తో అటు బంతితో హోల్డర్ నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్‌తో జరుగనున్న సిరీస్‌లో కూడా మెరుగ్గా రాణించి టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకోవాలని భావిస్తున్నాడు. బంగ్లాదేశ్ స్టార్ షకిబుల్ హసన్ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు.
అగ్రస్థానంలోనే కోహ్లీసేన
మరోవైపు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. విరాట్ కోహ్లి సేన తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ప్రస్తుతం భారత్ 113 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రానున్న వెస్టిండీస్ సిరీస్‌లో గెలిస్తే ర్యాంక్ మరింత పదిలం అవుతుంది. ఇక, న్యూజిలాండ్ 111 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలు అగ్రశ్రేణి జట్లను వెనక్కి నెట్టి టెస్టుల్లో రెండో స్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఇక, ఆస్ట్రేలియా ప్రస్తుతం ఐదో ర్యాంక్‌లో నిలిచింది. యాషెస్ సిరీస్‌ను గెలిచి టాప్ నిలవాలనే పట్టుదలతో ఉంది. ఇక, నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కూడా ఇదే లక్ష్యంతో కనిపిస్తోంది. యాషెస్‌ను గెలవడం ద్వారా ర్యాంక్‌ను మెరుగు పరుచుకోవాలని తహతహలాడుతోంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
టాప్‌లోనే టీమిండియా
RELATED ARTICLES