క్వింటా @ రూ. 12,001
ప్రజాపక్షం/ ఖమ్మం అర్బన్ చాలా కాలం తర్వాత పత్తి ధర పెరుగుతూ వస్తుంది. శనివారం రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ. 12,001 చొప్పున కొనుగోలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గ్రామానికి చెందిన గోకనపల్లి సైదులు… ఖమ్మం మార్కెట్‌కు 29 బస్తాల పత్తి తీసుకు రాగా, రికార్డు ధర పలికింది. నాగండ్ల వెంకటేశ్వరరావు అనే వ్యా పారి సైదులు వద్ద పత్తిని కొనుగోలు చేశాడు. 500 బస్తాలు రాగా అందులో ఎక్కువ భాగం రూ. 10వేలకు పైగానే ధర పలికింది. కనిష్ట ధర క్వింటా రూ. 9వేల చొప్పున నమోదైంది. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. వర్షాలకు ఎదుగు బొదుగు లేకపోవడంతో ఎకరాకు క్వింటా, రెండు క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. పత్తిని తొలగించి చాలా మంది ప్రత్యామ్నాయ పంటలను సాగు చేశారు. పంట పండించి ఇప్పటి వరకు నిల్వ ఉంచుకున్న వారికి మాత్రం అధిక ఆదాయం సమకూరింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో పత్తి ఈ స్థాయి ధర పలకడం ఇదే మొదటిసారి.
టాప్‌లేపిన పత్తి ధర
RELATED ARTICLES