న్యూఢిల్లీ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని టపాసుల కాల్చివేతపై ఆంక్షలు విధించిన సుప్రీంకోర్టు తమిళనాడు, పుద్దుచ్చేరికి కొన్ని మినహాయింపుల ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం, టపాసుల తయారీదారులు సోమవారం వేసిన పిటిషన్ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం అక్టోబర్ 23న ఇచ్చిన తీర్పులో కొన్ని మార్పులు చేస్తూ… మంగళవారం మరో తీర్పును వెల్లడించింది. టపాసులు కాల్చుకునేందుకు టైం బౌండ్ పెట్టడంతో ఇబ్బందులు ఎదుర్కోంటామని వారు కోర్టుకు తెలియజేశారు. దీపావళి అనేది నరకారుడి చావుకు ప్రతీకగా ఉదయం పూట టపాసులు కాల్చడం కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక ఆర్టికల్ 25 ప్రకారం మత విశ్వాసాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఒకవేళ ఇప్పటికిప్పుడూ… గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు చేపట్టేందుకు కూడా తమ దగ్గర సరైన సమయం లేదన్నారు. దీపావళి హిందువులకు ఎంతో పవిత్రమైనది అయినందునా ఇంతకు ముందు ఇచ్చిన సాయంత్రం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చలనే నిబంధనలో మార్పులు చేయాలని కోరారు. ఉదయం పూట టపాసులు కాల్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పిటిషనర్ల వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు కొన్ని సూచనలు చేస్తూ అనుమతిని మంజూరు చేసింది. టపాసులు కాల్చడం అనేది రెండు గంటలకు మించకుండా చూసుకోవాలని చెప్పింది. టపాసులు కాల్చుతున్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కోంది. తక్కువ సమయంలో టపాసులు కాల్చుతున్నప్పటికీ… ఎక్కువ మొత్తంలో ఉద్గారాలు వెలువడే అవకాశం ఉన్నందునా… వీలైనంత వరకు ఉద్గారాలను తగ్గించేలా చూసుకోవాలని సూచించింది.
టపాసులు కాల్చడంలో మార్పులు
RELATED ARTICLES