ప్రజాపక్షం/మంచిర్యాల ప్రతినిధి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీవాసవి జ్యువెలరీ దుకాణంలో ఆదివారం రాత్రి దొంగతనం జరిగిం ది. దుకాణం వెనకాల ఉన్న షటర్‌ను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొం గలు సుమారు రూ. 30 లక్షల విలువచేసే వెండి ఆభరణాలను ఎత్తుకెళ్ళా రు. సిసి కెమెరరాల కెబు ల్స్ కట్ చేసి వాటి స్టోరేజీ బాక్స్‌లను సైతం ఎత్తుకెళ్ళారు. సోమవారం ఉద యం యజమాని దుకాణం తెరవగా చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో తనిఖీలు నిర్వహించి చోరీకి గురైన దుకాణాన్ని నిశితంగా పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చెసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
‘జ్యువెలరీ’లో చోరీ
RELATED ARTICLES