పార్లమెంట్ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం
10 నియోజకవర్గాల్లో గెలుపు నిర్ణేతలు అతివలే
పురుష ఓటర్లకు తీసిపోమంటున్న మహిళలు
గెలుపోటముల్లో మహిళల ఓట్లు కీలకం అవుతాయంటున్న విశ్లేషకులు
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లు తమ సత్తా చాటనున్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజక వర్గాలకు గాను 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఎటు మొగ్గితే విజ యం వారిదేనన్నది సుస్పష్టం. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను 10 నియోజక వర్గా ల్లో మహిళలు అత్యధికంగా ఉండగా, మిగతా ఏడు నియోజక వర్గాల్లో పురుషులు అత్యధికంగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నియోజక వర్గాల వారీగా బుధవారం విడుదల చేసిన ఓటర్ల జాబితాను గమనిస్తే ఈ విషయం తేటతెల్లమైంది. దీంతో మహిళా ఓటర్లు ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారన్న అంచనాలు రాజకీయ వర్గాల ద్వారా వ్యక్తం అవుతున్నాయి. మహిళా ఓటర్లు ఆధిక్యతను చాటుకున్న లోక్‌సభ నియోజక వర్గాల్లో ఆదిలాబాద్ ( ఎస్‌టి), వరంగల్ (ఎస్‌సి), కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మహబూబ్‌నగసికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఓటర్ల గణన, జాబితాల్లో మార్పులు, సవరణలు తదితర అంశాలన్నీ పరగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. మొత్తం ఓటర్లు 2 కోట్ల 95 లక్షల 18 వేల 964 మంది ఓటర్లు ఉండగా , వీరిలో పురుష ఓటర్లు 1 కోటి 48 లక్షల 42వేల 619 మంది పురుష ఓటర్లు, 1 కోటి 46 లక్షల 74 వేల 977 మంది మహిళలు, 1368 మంది థర్డ్ జండర్ ఓటర్లు ఉన్నారు. అతి పెద్ద లోక్‌సభ నియోజక వర్గంగా మల్కాజిగిరి నియోజక వర్గం రికార్డు సృష్టిస్తోంది. ఈ నియోజక వర్గంలో 30 లక్షల 98 వేల 816 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అతి తక్కువగా మహబూబాబాద్ నియోజక వర్గం 14 లక్షల 14 వేల 210 మంది ఓటర్లతో అతి తక్కువ ఓటర్లు ఉన్న లోక్ సభస్థానంగా నమోదైంది. అత్యధిక నియోజక వర్గాల్లో సరాసరిన 15 లక్షల మంది ఓటర్లు ఉండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి దాదాపు లక్ష 10 వేల వరకు కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. ర్, నల్లగొండ, మహబూబాబాద్ ఉన్నాయి. పురుష ఓటర్లు అధికంగా ఉన్న నియోజక వర్గాల్లో పెద్దపల్లి (ఎస్‌సి), నాగర్ కర్నూలు, భువనగిరి, మల్కాజిగిరి,