HomeNewsBreaking Newsజైని మల్లయ్య పోరాటస్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

జైని మల్లయ్య పోరాటస్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

నివాళులు అర్పించిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ప్రముఖులు
ప్రజాపక్షం న్యూస్‌ నెట్‌వర్క్‌
స్వాత్రంత్య సమరయోధులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు జైని మల్లయ్య గుప్తా అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట శ్మశాన వాటికలో జరిగాయి. అంతకు ముందు హైదరాబాద్‌ నాగోల్‌లోని ఆయన కుమారుడు మధుసూధన్‌ నివాసంలో మల్లయ్య గుప్తా భౌతికకాయంపై పలువురు కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ప్రముఖులు పుష్పగుచ్చాలుంచి నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌ రెడ్డి, పశ్యపద్మ, ఇ.టి.నరసింహా, టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌, ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహరెడ్డి, గోద శ్రీరాములు, బొమ్మగాని ప్రభాకర్‌, సిపిఐ(ఎం) రాష్ట్ర నేత చెరుపల్లి సీతారాములు, తెలుగు యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎస్‌.వి.సత్యనారాయణ, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరిశంకర్‌, ఆంధ్ర జ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ తదితరులు మల్లయ్య భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు జైని మల్లయ్యగుప్తా పోరాటస్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని వారు ఈ సందర్భంగా కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు. మల్లయ్య మరణం కమ్యూనిస్టు పార్టీకే కాకుండా సాహితివేత్తలకు, సామాజిక ఉద్యమకారులకు తీరని లోటు అని వారన్నారు. అనంతరం మల్లయ్య భౌతికకాయాన్ని అభిమానులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఆయన స్వగ్రామం భువనగిరిలోని నివాసానికి తరలించారు.
మల్లయ్య మరణం తీరని లోటు
కంటతడి పెట్టిన పలువురు నాయకులు

యాదాద్రి: తెలంగాణ సాయుధ పోరాట యోధులు, సిపిఐ సీనియర్‌ నాయకులు జైని మల్లయ్య గుప్త ధన్య జీవి అని, ఆయన జీవితం నేటి తరానికి స్పూర్తి దాయకమని పలువురు నాయకులు అన్నారు. జైని మల్లయ్య మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, సామాజిక ఉద్యమకారులు గురువారం కడసారి వీడ్కోలు పలుకడానికి భువనగిరిలోని ఆయన నివాసానికి పెద్దఎత్తున తరలివచ్చారు. మల్లయ్య భౌతికకాయంపై పూల మాలలు వేసి ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. సిపిఐ నాయకులు భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి నివాలులు అర్పించారు. మల్లయ్య కుమారులు జైని రమేష్‌ను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైని మల్లయ్యతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. గంజ్‌లోని స్వర్ణకార విధీ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. హైదరబాద్‌లో అంత్యక్రియల నిమిత్తం భౌతికకాయాన్ని తరలిస్తూ జైని మల్లయ్య గుప్త అమరహే, మల్లయ్య గుప్తకు జోహర్లు నినదిస్తూ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.బాలమల్లేష్‌ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ జైని మల్లయ్య గుప్త మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అని నావాళులు అర్పించారు. అన్నారు. భువనగిరిలో గ్రంథాలయ ఉద్యమానికి అంకురార్పణ చేసిన పోరాట యోధుడు మల్లయ్య అని కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి సైతం మేధావులను కూడగట్టడంలో, ఆనాటి నిర్భంధాలను ఎదుర్కొని తెలంగాణ గళాన్ని వినిపించిన మహా నాయకుడని కొనియాడారు. అమరజీవి రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డిల నాయకత్వంలో భువనగిరిలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణానికి నిర్విరామంగా కృషి చేశారని గుర్తు చేశారు.
సాహితి వేత్తలకు తీరని లోటు
జైని మల్లయ్య గుప్త మరణం సాహితీవేత్తలకు తీరనిలోటు అని దాశరథి ఆవార్డు గ్రహీత డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య అన్నారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన సాహితి మిత్ర మండలిలో మల్లయ్య క్రీయశీలకంగా వ్యవహరించారని తెలిపారు. కవులు, రచయితలను అభ్యుదయం వైపు నడిపించిన వారిలో మల్లయ్య గుప్త ఒకరని అన్నారు. ఎంఎల్‌ఎసి ఎలిమినేటి క్రష్ణారెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మెన్‌ జడల అమరేందర్‌ గౌడ్‌, రైతుబంధు జిల్లా కన్వీనర్‌ కొలుపుల అమరేందర్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ ఆంజనేయులు, వైస్‌ చైర్మెన్‌ చింతల కిష్టయ్య, మార్కెట్‌ కమిటి చైర్మెన్‌ ఎడ్ల రాజేందర్‌ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, సభ్యులు తంగెళ్లపల్లి రవికుమార్‌, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు యానాల దామోదర్‌ రెడ్డి, బొలగాని సత్యనారయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల ఆశోక్‌, రాజయ్య, రైస్‌ మిల్లర్స్‌ ఆసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు పసుపునూరి నాగభూషణం, వైఎల్‌ఎన్‌ఎస్‌ బ్యాంకు చైర్మెన్‌ మందడి వెంకట్‌ రెడ్డి, డిటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు భాస్కర్‌, బిఎస్‌పి రాష్ట్ర నాయకులు బట్టు రాంచంద్రయ్య, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు రావుల రాజు తదితరులు మల్లయ్య గుప్తా భౌతికకాయయంపై పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments