ప్రజాపక్షం/అమరచింత: వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. ఆల్మట్టి డ్యామ్ నుం చి నారాయణపూర్ డ్యా మ్‌కు 3లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద కొనసాగుతోంది. నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు బుధవారం 2.60 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ మేరకు అధికారులు ప్రాజెక్టు 26 గేట్లు తెరిచి 2.60 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్న కోయిల్‌సాగర్, నెట్టెంపాడు రామన్‌పాడు, భీమా ఫేస్ ఫేస్ జమ్ములమ్మ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 240 , 110, మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.జూరాల ప్రాజెక్టు నుండి నెట్టెంపాడు 2,250 , భీమా 1300, భీమా కోయిల్ సాగర్‌లకు 315, ఎడమకాలువకు 750, కుడి కాలువకు 808, సూపర్ కెనాల్ 750 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ 318 మీటర్లు కొనసాగుతుండగా 9 టిఎంసిల సామర్థ్యం ఉన్న జూ రాల ప్రాజెక్టులో 8 టిఎంసిల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఇఇ హెచ్‌టి. శ్రీధర్ తెలిపారు.
జూరాలకు పెరుగుతున్న వరద
RELATED ARTICLES