శ్రీరాంసాగర్ పనులు పూర్తి చేసి సాగునీరందించాలి
మే 15లోగా చనాఖా పనుల పూర్తి
అధికారులకు ముఖ్యమంత్ర
ప్రజాపక్షం/హైదరాబాద్: “ఈ ఏడాది జూన్‌లోగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పి) పనులు పూర్తికావాలి, దీనికిం ద పూర్తి ఆయకట్టు 14.40 లక్షల ఎకరాల కు సాగునీరందించాలి, కావాల్సినన్ని నిధులి స్తాం, పనులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి” అని నీటిపారుదల శాఖాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్‌లో ఎస్‌ఆర్‌ఎస్‌పి పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మొదలుకొని చివరి ఆయకట్టు కలిగిన డోర్నకల్, తుంగతుర్తి, భూపాలపల్లి, పెద్దపల్లి, ి కెసిఆర్ ఆదేశాలు రామగుండం నియోజకవర్గాల వరకు అన్ని దిక్కులకు నీరందాలని ఆయన ఆదేశించారు. కాకతీయ వరద కాలువ మధ్యనున్న 1.10లక్షల ఎకరాలకు నీరందించాలని చెప్పారు. అవసరమైన చోట తూములను ఏర్పాటుచేయాలన్నారు. ఈ పనుల కోసం వెంటనే సర్వే నిర్వహించి ప్రారంభించాలన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజి అన్ని డిస్ట్రిబ్యూటరీలకు లైనింగ్ చేయాలని చెప్పారు. ఈ పనులకు సంబంధించి అంచనాలు తయారుచేసి టెండర్లు పిలవాలన్నారు. ఎండాకాలం లోపు ఈ పనులు పూర్తికావాలని చెప్పారు. ఎక్కువ కాంట్రాక్టర్లను నియమించి కాలువల పనులన్నింటిని సమాంతరంగా పూర్తిచేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల కాల్వలకు సంబంధించి హద్దులను నిర్ణయించాలన్నారు. ప్రాజెక్టు భూముల సమగ్రవివరాలను రూపొందించాలని ఆదేశించారు. కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను చేపట్టాలని చెప్పారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలను ఎవరైనా దున్నుకుంటే వాటిని పునరుద్ధరించాలన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపి రైతులను ఒప్పించాలని చెప్పారు. అన్ని ప్రాజెక్టుల ప్రొఫైల్ తయారుచేయాలన్నారు. ప్రతి ప్రాజెక్టుకు ఆపరేషన్ రూల్స్ తయారుచేయాలని చెప్పారు.