దయనీయం.. గెస్ట్ లెక్చరర్ల జీవనం
ముఖ్యమంత్రి కార్యాలయంలో వేతన ఫైల్ పెండింగ్
ఫలితంగా 9 నెలలుగా అందని వేతనాలు
ప్రజాపక్షం/ హైదరాబాద్: వారంతా డిగ్రీ విద్యార్థులకు విద్యా బోధన చేసే లెక్చరర్లు. ప్రభుత్వ లెక్చరర్లకు ఏ మా త్రం తీసిపోని విధంగా కాంట్రాక్ట్ పద్దతిన విద్యా బోధన చేసే గెస్ట్ లెక్చరర్లు. రాష్ట్ర వ్యా ప్తంగా ప్రస్తుతం 863 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ. 21,600 వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. వారు మధ్యలో విధులను వదిలి వెళ్లకుండా పక్కాగా కాంట్రాక్టు కూడా కుదుర్చుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 132 డిగ్రీ కళాశాలల్లో 863 మంది కాంట్రాక్ట్ ఒప్పందాన్ని కుదుర్చుకోగా, వీరు గత 9 నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో లెక్చరర్‌కు ఈ తొమ్మిది మాసాలకు సగటున రూ. 1,94,400 అందా ల్సి ఉంది. 132 మందికి కలిపి ఈ మొత్తం రూ.2,56,6,0800 కానుంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉన్నా.. రెగ్యులర్ లెక్చరర్ల కంటే తక్కువగానే చెల్లిస్తామని చెప్పినప్పటికీ వీరంతా గెస్ట్ లెక్చరర్లుగా ప్రభుత్వ ఒప్పందానికి సమ్మతించారు. ప్రైవేటుగా పని చేసే ఉద్యోగులు ఎవరైనా ఒకటి రెండు నెల లు జీతాలు రాక పోతేనే వారి ఆర్థిక పరిస్థితి గల్లంతు అవుతుంది. అలాంటిది ఏకంగా ఈ విద్యా ఏడాదంతా ఇవ్వక పోవడమంటే వారు ఎవరికి చెప్పుకోవాలి? మరి. ప్రభుత్వం తమ వేతనాల విషయంలో మానవతా దృక్ఫథంతో స్పందించాలని కోరుతూ వచ్చారు. ఇప్పటికే పలు దఫాల్లో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు, అలాగే కాలేజీయేట్ కమిషనర్‌కు,విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి, శాసన సభ్యులకు, ఉపాధ్యాయ కోటా ఎంఎల్‌సిల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకు ండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. రెగ్యులర్ ఉద్యోగులకు ఒక న్యాయం, తమకు మరో న్యాయమా అని వారు నిలదీస్తున్నారు. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లే కాదు,ఇంకా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా కేవలం నాలుగు వేల నుండి రూ.10 వేల వేతన భత్యాలతో చాలీ చాలని జీవితాలను గడుపుతున్న వారు 57 శాతం వర కు కార్మికులు ఉంటారని, ఉద్యోగ అభద్రత, ఉపా ధి లేమిని ఇప్పుడు పాలకులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నాయనికార్మికవర్గాలుఆరోపిస్తున్నాయి. గెస్ట్ లెక్చరర్స్..కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఇలా రకరకాల పేర్లతో పని చేయించుకుని వేతనాల చెల్లింపు మా త్రం చేయడం లేదని వారు మండిపడుతున్నారు.
సిఎం ఆఫీసులోనే పెండింగ్‌లో ఫైల్ :కిషోర్ కుమార్
రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాల ఫైలుసిఎం ఆఫీసులోనే పెండింగ్‌లో ఉందని తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ డా.సిహెచ్. కిశోర్ కుమార్ “ప్రజాపక్షం”కు తెలిపారు.వేతన బకాయిల విడుదల కోసం సచివాలయం చుట్టూ ఎన్ని సార్లు తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించక పోవ డం తమను తీవ్రంగా కలిచి వేస్తోందన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఫైల్ ( నెంబర్ 3728/సిఇ/ఎ/2018ను త్వరగా క్లియర్ చేయలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి గెస్ట్ లెక్చరర్లు అంతా విజ్ఞప్తి చేస్తున్నారన్నారు.