ప్రజాపక్షం/హైదరాబాద్ : లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ తగ్గించేందుకు వీలుగా ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేసిన కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర సర్కార్ ఆర్థిక ఎమర్జెన్సీ పేరుతో ఆర్డినెన్స్ తేవడం చెల్లదని నిజామాబాద్ రిటైర్డు ఫారెస్ట్ ఆఫీసర్ రమణ గౌడ్ హైకోర్టులో రిట్ వేశారు. దీనిని శుక్రవారం చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ఆర్డినెన్స్‌పై అభ్యంతాలకు వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ అందుకు అనుగుణంగా ఈ నెల 16న వెలువరించిన జిఒ 2ను సవాల్ చేసిన రిట్ తరఫున సీనియర్ లాయర్ సత్యంరెడ్డి వాదించారు. విపత్తులు సంభవించినప్పుడే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, కరోనా ఆ స్థాయి విపత్తు కాదన్నారు. పెన్షన్ ఆపడం అన్యాయమని, ఇది ప్రాథమిక హక్కుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే అవుతుందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇక్కడ వ్యక్తుల హక్కుల గురించి చెబుతున్నారని, అక్కడ ప్రజల హక్కులు ఉన్న విషయాన్ని మరిచిపోరాదని హితవు చెప్పింది. పెన్షన్‌లో కోత విధించకూడదని ఏ చట్టంలో ఉంది. ఆర్డినెన్స్ జారీకి గవర్నర్‌కు అధికారం ఉంది… అని హైకోర్టు వ్యాఖ్య చేసింది. రెగ్యులర్ ఆర్డినెన్స్‌లకు దీనికి (ఫైనాన్షియల్ ఎమర్జెనీ ఆర్డినెన్స్‌కు) తేడా ఉందని లాయర్ బదులిచ్చారు. విచారణ 3 వారాలకు వాయిదా పడింది.
జీతాలు, పెన్షన్ల కోతపైసర్కార్‌కు హైకోర్టు నోటీసులు
RELATED ARTICLES