ప్రజాపక్షం / హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిపాలనకు సంబంధించిన సవరణ బిల్లును శాసనమండలి బుధవారం ఆమోదించింది. శాసనమండలి ప్రత్యేక సమావేశంలో బుధవారం పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రవేశపెట్టిన జిహెచ్‌ంఎసి సవరణ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ స భ్యులు టి.జీవన్‌రెడ్డి, బిజెపి సభ్యులు ఎన్.రాంచందర్‌రా వు, ఎంఐఎం సభ్యులు సయ్య ద్ అమినుల్ హసన్ జాఫ్రి, టిఆర్‌ఎస్ సభ్యులు ఎం.ఎస్. ప్రభాకర్ , నవీన్‌కుమార్, ఆకుల లలిత, సభ్యులు కె.జనార్దన్‌రెడ్డి, అలుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. తొలుత మంత్రి కెటిఆర్ జిహెచ్‌ఎంసి సవరణ బిల్లు ఉద్ధ్దేశ్యాన్ని, చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
కేంద్రం ఒక్కపైసా ఇవ్వలె కెటిఆర్
బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌కు అదనంగా ఒక్క పైసానైనా విడుదల చేసిందా అని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రశ్నించారు. న్యాయంగా రావాల్సిన నిధులనే కేంద్రం ఎగ్గొడుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన జిఎస్‌టి రాష్ట్ర వాటాను ఎగ్గొటుతున్నారని, ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా నిధులు రావడం లేదని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంఎల్‌సి సభ్యులు రాంచందర్‌రావులకు ‘వాక్’ శుద్ధి ఉంటే సరిపోదని, చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వద్దకు వెళ్లి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని సూచించారు. వీధి వ్యాపారుల గుర్తింపు, లైసెన్స్, రుణాలను ఇప్పించడంలో తాము మొదటి వరసులో ఉన్నామన్నారు. వీధి వ్యాపారులకు కేవలం రుణాలను ఇప్పిస్తూ దానిని కూడా కేంద్ర ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటున్నదన్నారు. రోడ్లపై ప్రార్థన మందిరాల తొలగింపు విషయంలో బిజెపి, ఎంఐఎం సహకరిస్తే రోడ్డు వేడల్పులు, అభివృద్ధి చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నా రు. ఇలాంటి విషయాల్లో బిజెపి, ఎంఐఎం ఒకరిపైమరొకరు మాట్లాడుతారన్నారు. రోడ్లపై ఉన్న ప్రార్థన మందీరాలను తొలగించే విషయమై నాడు గుజరాత్ రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని కెటిఆర్ గర్తు చేశా రు. ఏ దేవుడు కూడా దిక్కుమాలిన కాలుష్య ప్రాంతాల్లో, నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండాలని కోరుకోరని చెప్పారు. చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ అంశంపై తాము సిద్ధమేనని, అందుకు బిజెపి, కాంగ్రెస్ ముందుకు రావాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బిసిల కు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు సత్యదూరమన్నా రు. ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లను ఎవ్వరూ మార్చలేరని, జనాభా లెక్కలు చేసిందే నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని, దా ని ఆధారంగానే తాము ఎన్నికలను నిర్వహించామని వివరించారు. బిసిలకు 33.33 శాతం రిజర్వేషన్లు యధావిధిగా అమలవుందని, దీనికీతోడుగా తమ పార్టీ 67 శాతానికిపైగా బిసిలకు గ్రేటర్‌లో అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
అంతకుముందు టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు మొత్తం కలిసి 41.33 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతోందని, దీనిని 50 శాతానికి పెంచాలని కోరారు. 50 శాతం వరకు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్‌లో తక్కవగా అమలవుతోందని, బిసిలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని పరిశీలించాలన్నారు. పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తే బలహీనవర్గాలకు అన్యాయం చేసినవారవుతారన్నారు. ఎన్నికల కమిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా ఉండకూడదని సూచించారు. ఎన్. రాంచందర్‌రావు మాట్లాడుతూ ముస్లింలకు బిసి ఇ రిజర్వేషన్లను కేవలం విద్యా, ఉపాధి రంగాల్లో మాత్రమే తీసుకొచ్చారని, రాజకీయాల్లో వాటిని అమలు చేస్తే బిసిలు నష్టపోతారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చ ట్టాలను సవరించడం మంచి పరిణామమన్నారు.
సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రి మాట్లాడుతూ ప్రార్ధ న మందీరాల విషయంలో గుజరాత్, అహ్మదదాబాద్ విధానాన్ని ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం లేదన్నా రు. అంబర్‌పేటలో మసీద్‌ను నిర్మించాల్సిందేనని చెప్పా రు. అనేక ప్రాంతాల్లో వర్షం నీరు వస్తుందన్నారు. అలుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల తేదీని నిర్ణయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఉండకూడదని, దీనిని ఉపసంహంచుకోవాలని కోరారు. కేంద్ర ప్రభు త్వం కూడా ఎంపి, ఎంఎల్‌ఎ ఎన్నికలు ఒకేసారి జరగాలని, తేదీని కూడా కేంద్రమే నిర్ణయించే అవకాశాలు ఉన్న ట్టు తెలుస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రజాస్వామికంగా ఉండాలని, అలా ఉంటేనే దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే అవకాశం ఉంటుందని సూచించారు.
జిహెచ్‌ఎంసి సవరణ బిల్లును శాసన మండలి ఆమోదం
RELATED ARTICLES