హైదరాబాద్ : రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ (జెడ్‌పి) చైర్‌పర్సన్ పదవులు టిఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. అదే విధంగా 32 వైస్ చైర్‌పర్సన్ పదవులను కూడా అధికార టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మరో వైపు కోఆపన్షన్ పదవులన్నీ కూడా టిఆర్‌ఎస్ దక్కించుకుంది. జెడ్‌పి చైర్‌పర్సన్ పదవులను దక్కించుకు న్న వారిలో ముగ్గురు మాజీ ఎంఎల్‌ఎలు, ముగ్గు రు మాజీ ఎంఎల్‌ఎల వారసులు, ఒక ఎంఎల్‌ఎ భార్య ఉన్నారు. జెడ్‌పి చైర్‌పర్సన్ పదవులకు నేతల ఎంపికలో టిఆర్‌ఎస్ అందరినీ సంతృప్తిపరిచే విధంగా చర్యలు తీసుకున్నట్లు కనబడింది. కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన నేతలకు, వారి వారసులకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు జెడ్‌పి చైర్‌పర్సన్ పదవులలో టిఆర్‌ఎస్ ప్రాధాన్యత కల్పించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ నుంచి ఎంఎల్‌ఎగా గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఆత్రం సక్కుపై ఓడిపోయి న మాజీ ఎంఎల్‌ఎ కోవా లక్ష్మి కి జెడ్‌పి చైర్‌పర్సన్‌గా అవకాశమిచ్చారు. మంచిర్యాల జిల్లా మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలుకు మొన్నటి ఎన్నికలో చెన్నూ రు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ఆయన భార్య నల్లాల భాగ్యలక్ష్మిని జెడ్‌పి చైర్‌పర్సన్‌గా సర్దుబాటు చేశారు. మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన మాజీ ఎంఎల్‌ఎ పుట్ట మధుకు పెద్దపల్లి జెడ్‌పి చైర్ పర్సన్‌గా అవకాశం కల్పించారు. మధిర నుంచి సిఎల్‌పి నేత మల్లు భట్టివిక్రమార్క చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన లింగాల కమల్‌నాథ్‌కు ఖమ్మం జెడ్‌పి చైర్‌పర్సన్ పదవి ఇచ్చారు. అదే విధంగా ఇ ల్లందు మా జీ ఎంఎల్‌ఎ కో రం కనకయ్య 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనపై ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనపై గెలుపొందిన హరిప్రియానాయక్ కాంగెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఓడిపోయిన కోరం కనకయ్యకు భధ్రాద్రి కొత్తగూడెం జెడ్‌పి చైర్ పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. వరంగల్ రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయన భార్య గండ్ర జ్యోతికి భూపాలపల్లి జెడ్‌పి చైర్ పర్సన్‌గా ఎంపిక చేశారు. నల్లగొండ నుంచి 2014లో ఎంఎల్‌గా గెలిచిన బండా నరేందర్‌రెడ్డికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. ఆయనను సంతృప్తి పరిచేందుకు ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ సోదరుడు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డిపై జెడ్‌పిటిసిగా విజయం సాధించిన నరేందర్‌రెడ్డిని నల్లగొండ జెడ్‌పి పీఠంపై కూర్చోబెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రులు ఎలిమినేటి మాధవరెడ్డి , ఉమా మాధవరెడ్డి దంపతుల కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డికి జిల్లా చైర్ పర్సన్‌గా టిఆర్‌ఎస్ అవకాశం ఇచ్చింది. మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డిన ఓడించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డిని రంగారెడ్డి జెడ్‌పి చైర్ పర్సన్‌గా చేశారు. మేడ్చల్ నుంచి 2014లో ఎంఎల్‌ఎగా గెలిచిన ఎం.సుధీర్‌రెడ్డికి టిఆర్‌ఎస్ టిక్కెట్ నిరాకరించి ఆయన స్థానం మాజీ ఎంపి సిహెచ్.మల్లారెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. సుధీర్‌రెడ్డిని సంతృప్తి పరిచేందుకు ఆయన కుమారుడు శరత్‌చంద్రరెడ్డికి మేడ్చల్ జెడ్‌పి చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఇక మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎంఎల్‌ఎ స్వర్ణ సుధాకర్‌కు అవకాశమిచ్చారు.
పట్నం సునిత హాట్రిక్ : జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా బాద్యతలు చేపట్ట డంలో రాష్ట్ర మాజీ మంత్రి పట్నం సునిత హాట్రిక్ సాధించారు. టిడిపి నుం చి రెండు సార్లు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా సునిత ఎన్నిక య్యారు. అనంతరం టిఆర్‌ఎస్‌లో చేరిన ఆమె తిరిగి ప్రస్తుతం వికారాబాద్ జిల్లా జెడ్‌పి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీంతో వరుసగా మూడుసార్లు ఎన్నికైన జిల్లా పరిసత్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సాధించారు.
జిల్లా పరిషత్‌లన్నీ టిఆర్‌ఎస్ ఖాతాలోకే
RELATED ARTICLES