న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) వసూ ళ్లు గత నెల ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకున్నా యి. కరోనా సంక్షోభ సమయంలోనూ 1.41 లక్షల కోట్ల రూపాయల మేర భారీ మొత్తం లో వసూలుకావడం గమనార్హం. గత నెలలో రూ. వరుసగా ఏడో నెల వసూళ్లు రూ. లక్ష కోట్ల మార్కును దాటిందని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది. జిఎస్‌టి విధానం అమల్లోకి వచ్చిన
తర్వాత గత నెల సూలైన మొత్తం అంతకు ముందెన్నడూ జరగలేదని పేర్కొంది. ఏప్రిల్‌లో వసూలైన మొత్తంలో కేంద్ర జిఎస్‌టి వాటా రూ. 27,837 కోటు కాగా. రాష్ట్ర జిఎస్‌టి కింద రూ. 35,621 కోట్లు, సమీకృత జిఎస్‌టి కింద రూ. 68,481 కోట్లు, సెస్ రూపంలో రూ. 9,445 కోట్ల మేర ఆదాయం సమకూరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. గత ఏడు నెలలుగా జిఎస్‌టి వసూళ్లు ఒక లక్ష కోట్ల రూపాయలను అధిగమించిందని గుర్తుచేసింది. అంతేగాక క్రమంగా పెరుగుతూ వస్తున్నదని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటున్నదనడానికి జిఎస్‌టి వసూళ్ల పెరుగుదలే నిదర్శనమని తెలిపింది. తప్పుడు బిల్లులను నియంత్రీకరించడంతోపాటు జిఎస్‌టి, ఆదాయపన్ను, కస్టమ్స్, ఐటి తదితర శాఖలు సమష్టిగా పటిష్టమైన చర్యలు చేపట్టడంతో రికార్డు వసూళ్లు సాధ్యమైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.
జిఎస్‌టి ఆల్‌టైమ్ రికార్డు వసూళ్లు
RELATED ARTICLES