HomeNewsNationalజార్కండ్‌ కొత్త సిఎంగా చంపై సోరెన్‌ ప్రమాణం

జార్కండ్‌ కొత్త సిఎంగా చంపై సోరెన్‌ ప్రమాణం

రాంచి : జెఎంఎం శాసనసభాపక్షనేత చంపై సోరెన్‌ శుక్రవారం జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ పి. రాధాకృష్ణన్‌ చంపైతో ప్రమాణం చేయించారు. చంపై సోరెన్‌తో పాటు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఆలం, ఆర్‌జెడి నేత సత్యానంద్‌ భోక్తా మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజ్‌భవ్‌న దర్బార్‌ హాల్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి జెఎంఎం నేతృత్వంలోని కూటమి నేతలు హాజరయ్యారు. 67 ఏళ్ల
గిరిజన నేత జార్ఖండ్‌ 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. జార్ఖండ్‌ కొల్హాం రీజియన్‌ నుంచి ముఖ్యమంత్రి కావడం చంపై ఆరవ సిఎం. మనీలాండరింగ్‌ కేసులో జెఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌పై ఇడి విచారణ నేపథ్యంలో గత రెండు రోజులుగా జార్ఖండ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. జనవరి 31న హేమంత్‌ను ఇడి అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆ వెంటనే ఆయన సిఎం పదవికి రాజీనామా చేశారు. అక్కడి కాసేపటికే సంకీర్ణ కూటమి తమ శాసనసభపక్ష నేతగా చంపై సోరెన్‌ను ఎన్నుకుంది. ఆ తర్వాత హేమంత్‌ను ఇడి అధికారులు అరెస్టు చేయడం చకాచకా జరిగిపోయాయి. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైన కూడా కొన్ని గంటల పాటు సందిగ్ధం నెలకొంది. చివరకు చంపై నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు గురువారం అర్ధరాత్రి గవర్నర్‌ నుంచి నిర్ణయం వెలువడింది. 10 రోజుల్లోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆదేశించారు. 81 మంది ఎంఎల్‌ఎలు ఉన్న జార్ఖండ్‌ శాసనసభలో జెఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది. ఫిబ్రవరి 5వ తేదీన చంపై సోరెన్‌ ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకుంటుందని మంత్రి ఆలంగీర్‌ ఆలం తెలిపారు. చంపై ప్రమాణస్వీకారం తర్వాత గవర్నర్‌ మీడియాతో మాట్లాడారు. ‘మేం ఎప్పుడూ ఒకటే ఆశిస్తాం. పేదలకు సేవ చేయాలి. వారి ప్రాథమిక అవసరాలు తీర్చాలి. మంచి రోడ్లు, మంచి తాగునీరు, మంచి పాఠశాలలు, మంచి ఆరోగ్య సంరక్షణ, మంచి ఇళ్లు అందించాలి. రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపడాలి. తద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది‘ అని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments