నివాళులర్పించిన గవర్నర్, సిఎం, మంత్రులు, న్యాయమూర్తులు
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రజాపక్షం/హైదరాబాద్: హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, మానవ హక్కు ల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి (76) కన్నుమూశారు. కాలేయ సంబంధి త వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా గచ్చిబౌలిలోని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. సుభాషణ్‌రెడ్డి భౌతికకాయా న్ని హైదరాబాద్ అవంతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సుభాషణ్‌రెడ్డి భౌతికకాయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ సందర్శించి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను కెసిఆర్ స్మరించుకున్నారు. ఆయన కుటుంబసభ్యుల కు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కె జోషిని ఆదేశించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు సుభాషణ్‌రెడ్డి మరణ వార్త వినగానే తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్,మహమూద్ అలీ,ఇంద్రకరణ్‌రెడ్డి,మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పలువురు హక్కుల నేతలతో పాటు ఎంఐఎం అధినేత ఒవైసి, పలువురు నాయమూర్తులు, న్యాయకోవిదులు, వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి సంతా పం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.