న్యూఢిల్లీ: శ్రీలంక మాజీ స్టార్ క్రికెటర్ సనత్ జయసూర్యపై ఐసిసి వేటు వేసింది. ఐసిసి యాంటి కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించాడని జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) రెండేళ్లపాటు నిషేధం విధించింది. ఈ రెండేళ్ల పాటు జయసూర్య క్రికెట్‌కు అన్ని విధాలుగా దూరంగా ఉండాలని ఆదేశించింది. శ్రీలంక క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరించిన జయసూర్య.. దర్యాప్తుకి సహకరించడం లేదని ఐసీసీ గతంలో తెలిపింది. అతడిపై రెండు అభియోగాలను నమోదు చేసింది. ఆర్టికల్ 2.4.6, ఆర్టికల్ 2.4.7ల ప్రకారం జయసూర్యపై నిషేధం విదించింది.
జయసూర్యపై ఐసిసి వేటు!
RELATED ARTICLES