అది దేశ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకం
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ : దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను కాంగ్రెస్ శుక్రవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈచర్య సమాఖ్య హామీలకు, రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని తెలిపింది. ‘జమిలి’ నిర్వహణ ఆలోచనను విరమించుకోవాలని, దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన ఉన్నతాధికార కమిటీని రద్దు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ కార్యదర్శికి రాసిన లేఖలో రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ‘అణగదొక్కడానికి’ కేంద్ర ప్రభు త్వం తన వ్యక్తిత్వాన్ని, మాజీ రాష్ర్టపతి కార్యాలయాన్ని ‘దుర్వినియోగం’ చేయడానికి అనుమతించవద్దని ప్యానెల్‌కు నాయకత్వం వహిస్తున్న మాజీ రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్‌ను అభ్యర్థించారు. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ అనే ఆలోచనను భారత జాతీయ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అభివృద్ధి చెందుతున్న, పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించడం కోసం, ఆ మొత్తం ఆలోచనను విడిచిపెట్టి, ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయడం అత్యవసరం’ అని ఖర్గే కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘ఈ దేశం లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తన వ్యక్తిత్వాన్ని, భారత మాజీ రాష్ర్టపతి పదవిని దుర్వినియోగం చేయడానికి అనుమతించవద్దని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల తరపున, ఉన్నత స్థాయి కమిటీ అధ్యక్షుడిని నేను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను’ అని తన లేఖలో పేర్కొన్నారు. ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రయోజనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనకు సూచనలను ఆహ్వానిస్తూ అక్టోబరు 18న చంద్ర రాసిన లేఖకు ప్రతిస్పందనగా ఆయన ఈ లేఖ రాశారు. ఏకకాల ఎన్నికల వంటి అప్రజాస్వామిక ఆలోచనల గురించి మాట్లాడటం ద్వారా ప్రజల దష్టిని మరల్చకుండా ప్రజల ఆదేశాన్ని గౌరవించేలా ప్రభుత్వం, పార్లమెంటు, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి పని చేయాలని ఖడ్గే అన్నారు.
భారతదేశానికి అమత్‌కాల్ కంటే శిక్షా కాలమే అవసరం
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే దేశంలో విద్యారంగ స్థితిపై మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2024లో భారతదేశం తన విద్యార్థులకు న్యాయం జరిగేలా హామీ ఇస్తుందని అన్నారు. ‘అమత కాలం కంటే, మాకు భారతదేశానికి శిక్షా కాలమే అవసరం’ అని ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘2024లో భారతదేశం మోదీ ప్రభుత్వం నుంచి మా విద్యార్థులకు న్యాయాన్ని నిర్ధారిస్తుంది. ఎందుకంటే ‘విద్య’పై దాని నివేదిక కార్డు స్థూల వైఫల్యంతో గుర్తించబడింది’ అని వార్షిక విద్యా నివేదిక (ఏఎస్‌ఈఆర్) ను ఉటంకిస్తూ పేర్కొన్నారు. ‘గ్రామీణ భారతదేశంలోని 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులలో 56.7 శాతం మంది మూడవ తరగతి గణితం చేయలేరు. ఈ వయస్సులో 26.5 శాతం మంది ఇప్పటికీ వారి ప్రాంతీయ భాషలో రెండవ తరగతి స్థాయి వచనాన్ని స్పష్టంగా చదవలేరు’ అని తెలిపారు. 17-18 ఏళ్ల మధ్య ఉన్న యువతలో 25 శాతం మంది ‘ఆసక్తి లేకపోవడం’ కారణంగా విద్యను నిలిపివేసినట్లు కూడా ఆయన గుర్తించారు. ఖడ్గే తన పోస్ట్‌తో పాటు 35 సెకన్ల నిడివి గల వీడియోను కూడా పోస్ట్ చేశారు. బీజేపీ మన యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది’ అని ఖడ్గే ఆరోపించారు.
‘జమిలి’పై కమిటీని రద్దు చేయండి
RELATED ARTICLES