ప్రస్తుత హైదరాబాద్ నగర జనాభా కోటి 20 లక్షలు
మెట్రోరైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ భవిష్యత్‌లో పెరిగే రెండు కోట్ల నగర జనాభాకు అనుగుణంగా మెట్రోరైల్ విస్తరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్) ఎం.డి. ఎన్.వి.ఎస్. రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోటి 20 లక్షలు, ఉందని, ఐటి ఉద్యోగులే సుమారు 10 లక్షల వరకు ఉంటారని, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు పక్కల భవిష్యత్‌లో పెరిగే కోటి జనాభాకు అనుగుణంగానే మెట్రోరైల్‌కు సిఎం కెసిఆర్ నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని మెట్రో భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్‌విఎస్ రెడ్డి మెట్రోరైల్ విస్తరణపై వివరాలు వెల్లడించారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డిపిఆర్) రూపొందిస్తున్నామని, డిపిఆర్ వచ్చాక సమగ్ర సమాచారం తెలుపుతామన్నారు. ప్రస్తుతం మెట్రోరైల్ విస్తరణను పూర్తిగా ప్రభుత్వం నిధులతోనే చేపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు భరిస్తాయన్నారు. ఇందుకోసం ఇటీవల రాష్ట్ర మంత్రి కెటిఆర్ కేంద్రమంత్రిని కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే )
ఎంజిబిఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఎల్ అండ్ టి మెట్రోరైల్ పనులు చేపడుతుందన్నారు. మెట్రో నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను సేకరిస్తామని, ఈ విషయంలో కేంద్ర రక్షణ శాఖ అధికారులతో మంత్రి కెటిఆర్ చర్చించారన్నారు. ప్రస్తుతం మెట్రోరైల్‌లో సుమారు రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారని, త్వరలోనే ఎడు లక్షలకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయన్నారు.
ఓఆర్‌ఆర్ చూట్టు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే..
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యమని ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. గతంలో తన ప్రతిపాదనను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుతం సిఎం కెసిఆర్ విజన్‌తో ఓఆర్‌ఆర్ మెట్రోకు ముందడుగు పడిందన్నారు. ఎంజిబిఎస్ నుంచి ఫలక్‌నుమా మెట్రో పనులు త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నాగోల్ నుంచి ఎల్.బి.నగర్ కూడా మెట్రోను అనుసంధానిస్తామన్నారు. పటాన్ చెరువు నుంచి నార్సింగి వరకు 22 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్, తుక్కుగూడ, బొంగుళూరు, పెద్ద అంబర్‌పేట వరకు 40 కిలోమీటర్లు మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు తెలిపారు. మేడ్చల్ నుంచి పటాన్ చెరువు వరకు 29 కిలోమీటర్లు, తార్నాక నుంచి ఈసిఐఎల్ వరకు ఎనిమిది కిలోమీటర్లు, ఎల్.బి. నగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు మెట్రో కారిడార్ విస్తరించనున్నట్లు తెలిపారు. శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు 28 కిలోమీటర్ల విస్తరించనున్నట్లు చెప్పారు. ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు 25 కిలోమీటర్లు, జెబిఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నామన్నారు. ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు.
జనాభాకు అనుగుణంగా మెట్రో విస్తరణ
RELATED ARTICLES