HomeNewsBreaking Newsఛాంపియన్‌ కెనిన్‌

ఛాంపియన్‌ కెనిన్‌

తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న సోఫియా
ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్లో ముగురుజాపై విజయం
రన్నరప్‌తో సరిపెట్టుకున్న స్పెయిన్‌ క్రీడాకిరిణి
మెల్‌బోర్న్‌: ఎంతో ప్రతిష్టాత్మతంగా జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో సోఫియా కెనిన్‌(యుఎస్‌) ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో గార్బియో ముగురుజా(స్పెయిన్‌)ను ఓడించి విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌ ఫోరులో తొలుత ముగురాజానే పైచేయి సాధించినప్పటికీ రెండో సెట్‌లో సోఫియా తేరుకుంది. తనదైన షాట్‌లతో ముగురుజాను ముప్పతిప్పలు పెట్టి తదుపరి రెండు సెట్లను కైవసం చేసుకుంది. ఈ గేమ్‌లో ముగరుజా చేసిన తప్పులను కూడా అనుకూలంగా మిర్చుకుంది 21 ఏళ్ల అమెరికా సుందరి. ముగురుజా తొలి సర్వీస్‌తో సెట్‌ ఆరంభమైంది. ఈ సెట్‌లో ముగురుజా కెనిన్‌ 4-6తో ఓడించింది. తరువాత సెట్‌లో 2-2 పాయింట్ల వరకు ఇద్దరు నువ్వానేనా అన్నట్లుగా పోరాడారు. కానీ మూడో పాయింట్‌ నుంచి కెనిన్‌ తెలివైన షట్లతో ముగురుజాను కోర్టు రెండు మూలలకు పరుగు పెట్టించింది. దీంతో రెండో కెట్‌ను 6–2తో కెనిన్‌ కైవసం చేసుకుంది. అప్పటి ఇరువురు తలో సెట్‌ గెలిచి సమంగా ఉన్నారు. కోర్టు ఆవరణం మొత్తం వేడెక్కింది. అందరూ విజేత ఎవరా ఆతృతగా ఎదరుచూడసాగారు. ఇక మూడో సెట్‌ ప్రారంభం అయ్యింది. ఈ సెట్‌ తొలి రెండు పాయింట్లతో ముగురుజా ముందంజ వేసినప్పటికీ కెనిన్‌లో ఆత్మస్థుర్యైం సడలలేదు. ఈ తరుణంలో సోఫియా విజృంభించి వరుస పాయింట్లతో దూసుకుపోయింది. దీంతో 6-2తో ముగురుజాపై విజయం సాధించి తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. కాగా, గార్బియో ముగురుజా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో కెనిన్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన రెండో ఆమెరికా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. అంతకు ముందు సెరీనా విలియమ్స్‌ 2002లో జెన్నీఫర్‌ కెప్రియటీపై గెలుపొంది తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకుంది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ గెలుచుకున్న తొలి పిన్న వయస్కురాలిగా కెనిన్‌ రికార్డును సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో… కెనిన్‌
సోఫియా ఈ టోర్ని అన్ని రౌండ్‌లలోనూ సునయానంగానే విజయాలు సాధించింది. ఫైనల్లో కూడా తడపడకుండా విజయానందుకుంది. తొలి రౌండ్‌లో ఇటలీకి చెందిన మార్టినా ట్రెవిసన్‌తో తలపడిన కెనిన్‌ సంచలనం సృష్టించింది. 6-2, 6-4తో మార్టినాను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. ఈ రౌండ్‌లో అన్‌లితో పోరాడిన ఊహించనంత ఆలవోకగా 6-1, 6-3తో లీని మట్టికరిపించి మూడో రౌండ్‌లోకి ప్రవుశించింది. అక్కడ చెనాకు చెందిన జాంగ్‌ షూయ్‌తో మోరాహోరీగా తలపడింది. కానీ, తనదైన మార్క్‌ ఆటతో 7-5, 7-6(9/7)తో షూయ్‌ని ఓడించింది. ఈ టోర్నీలో కెనిన్‌ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొ రౌండ్‌ ఇదే. ఇక నాలుగో రౌండ్‌లో యువ సంచలనం ఆమెరికాకు చెందిన కొరీ గాఫ్‌తో పోరుకు దిగింది. ఈ రౌండ్‌లో తొలి సెట్‌లో ఇద్దరు చెమటోడ్డారు. తొలి సెట్‌ను 7-6(7/5)తో గాఫ్‌ సొంతం చేసుకోగా మిగితా రెండు సెట్లలో కెనిన్‌ చెలరేగింది. దీంతో గాఫ్‌ సమాధానం ఇవ్వకుండానే 3-6, 0-6తో కెనిన్‌కు దాసోహమంది. దీంతో సోఫియా తొలిసారి వార్టరర్స్‌లో అడుగుపెట్టింది. కార్టరర్స్‌లో టునిషియాకు చెంది ఓన్స్‌ జాబేర్‌తో తలపడి 6-4, 6-4తో ఓడించింది. ఇక సెమీస్‌లో 23 ఏళ్ల అస్లే బార్టీతో హోరాహోరీకి దిగింది. ఈ గేమ్‌లో తీవ్ర ఒత్తిడిలోనూ పైచేయొఇ సాధించింది. 7-6(8/6), 7-6తో బార్టీని ఇంటిదారి పట్టించిన కెనిన్‌ తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్లో అడుగు పెట్టింది. ఫైనల్లో ముగురుజాను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది.
తొలి గాండ్‌ స్లామ్‌…
మాస్కోలో అలెగ్జాండర్‌, లీనా కెనిన్‌ దంపతులకు సోఫియా కెనిన్‌ నవంబర్‌ 14, 1998న జన్మించారు. ఆమె తల్లి సోవియట్‌ యూనియన్‌లో నర్సుగా పనిచేసింది. కెనిన్‌ అత్యంత మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన క్రీడాకారిణి. ఆమె తండ్రి అలెగ్జండర్‌ కెనిన్‌ కూడా టెన్నిస్‌ క్రీడాకారుడే. ఆయనను ఆదర్శంగా తీసుకోని కెనిన్‌ ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటి నుంచే టెన్నిస్‌ ఆడటం ప్రారంభించింది. సోఫియా ఆటతీరును గమనించింది ఆమె తల్లిదండ్రులు ఫ్లోరిడాలోని బ్రోవార్డ్‌ కౌంటీలో రిక్‌ మాకీతో శిక్షణకు పంపించారు. అక్కడ ఆమె దాదాపు ఏడు సంవత్సరాలు శిక్షణ పొందింది. కాగా, ఆమె తొలిసారి యుఎస్‌ ఓపెన్‌ ద్వారా గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2017. 2018, 2019లలో జరిగిన టోర్నీలలో మూడో రౌండ్‌తోనే సరిపెట్టుకుంది. ఇక విబుల్డన్‌ రెండు సార్లు(2018, 2019) రెండో రౌండ్‌కే పరిమితమయ్యింది. అటు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో(2019) అడుగు పెట్టిన కెనిన్‌ అద్భుతమైన ఆటతీరుతో నాలుగో రౌండ్‌ వరకూ దూసుకెళ్లింది. ఇక తొలిసారి 2020 ఆస్ట్రేలియా ఓపెన్‌లో అడుగు పెట్టిన సోఫియాకు ఎదురే లేకుండా పోయింది. ఇవే కాకుండా ఆమె నాలుగు సార్లు డబ్ల్యూటిఎ టైటిళ్లు, మరో నాలుగు సార్లు ఐటిఎఫ్‌ టెటిళ్లు కైవసం చేసుకుంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments