2కి.మీ. దూరం వరకు ఉపసంహరించినట్లు సైన్యం వెల్లడి
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తత సడలే అవకాశాలు కన్పిస్తున్నాయి. అక్కడ సైనిక ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలవంతమయ్యా యి. ఇరుదేశాలు బలగాల ఉపసంహరణకు అంగీకరించాయి. వాస్తవాధీనరేఖ (ఎల్‌ఎసి) వెంబడి గల్వన్ లోయ, సహా హాట్‌స్ప్రింగ్స్, లద్దాఖ్ ప్రాం తాల నుంచి నుంచి చైనా బలగాలు దాదాపు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. అదే విధంగా అక్కడు న్న సైనిక శిబిరాలను కూడా తొలగిస్తున్నట్ల వెల్లడించాయి. ఇందుకు ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి మళ్లాయని.. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ‘బఫర్ జోన్’ ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. గల్వన్‌లోయలో ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయి చేరిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్- చైనా మధ్య వివిధ స్థాయిల్లో మూడు దఫాలుగా చర్చలు జరిగాయి. భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో నెలల తరబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్లేనని సైనిక వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ చొరవచూపి, చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. చైనా, భారత చర్చల ఫలితంగా ఎట్టకేలకు ఫింగర్ 4 పాయింట్ నుంచి చైనా సైన్యం సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వెనక్కి వెళ్లింది. ఇటీవల ప్రధాని మోడీ పర్యటన అనంతరం అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రితో ఆదివారం సుమారు రెండుగంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దుల్లో శాంతి యుత పరిస్థితులు నెలకొల్పాలని ఇరు దేశాల ప్రతినిధులు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఇరుదేశాల సైనిక బలగాలను వీలైనంత తొందరగా ఉపసంహరించుకోవాలని అంగీకరించారు. వాస్తవాధీన రేఖను రెండు దేశాలు పరస్పరం గౌరవించుకోవాలని, ఏకపక్షంగా ఎల్‌ఎసిని మార్చే ప్రయత్నాలను మానుకోవాలని నిర్ణయించారు. అలాగే ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాల కోసం చర్చలు నిరంతరం కొనసాగాలని ఒప్పందం కుదుర్చున్నారు. ఈ కారణంగానే బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఆరంభమైంది.
చైనా బలగాలు వెనక్కి!
RELATED ARTICLES