బెంగాల్ 300 ఆలౌట్
రంజీ ట్రోఫీ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బౌలర్ శశికాంత్ (5/55) విజృంభించడంతో బెంగా ల్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఆదివారం తొలి ఇనింగ్స్ ఆరంభించిన ఆంధ్రప్రదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జ ట్టు స్కోరు 4 వద్దే ఓపెనర్ ప్రశాంత్ కుమా ర్ (0) ఖాతా తెరువకుండానే ఔటయ్యా డు. అనంతరం మరో ఓపెనర్ జ్ఞానేశ్వర్, జ్యోతి కృష్ణ ఆంధ్ర ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు సా గించారు. ఈ క్రమంలోనే కుదురుగా ఆడుతున్న జ్ఞానేశ్వర్ అర్ధ శతకం నమోదు చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్ర స్కోరు 100 పరుగుల మార్కును దాటింది. అనంతరం సమన్వయంతో ఆడుతున్న జ్యోతికృష్ణ (130 బంతుల్లో 43) పరుగులు చేసి షె బాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 104 పరుగులు జోడించా రు. తర్వాత రెండో రోజు ఆట ముగియడంతో ఆంధ్రప్రదేశ్ 43 ఓవర్లలో 108/2 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (64 బ్యా టింగ్), రికీ భుయ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 194/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగి న బెంగాల్‌కు బిజోయ్ చటర్జీ (76), ప్రదీ ప్ ప్రమానిక్ (43) ఆదుక్నురు. వీరు ఏడో వికెట్‌కు 90 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొలిపి బెంగాల్‌ను ఆదుకున్నారు. తర్వాత పుంజుకున్న శశికాంత్ వరుసక్రమంలో వికెట్లు తీస్తూ బెంగాల్‌ను 300 పరుగులకే కట్టడి చేశాడు. విజృంభించి బౌలింగ్ చేసిన శశికాంత్ 55 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తం 5 వికెట్లు ప డగొట్టాడు. మరోవైపు పృథ్వీ రాజ్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు.
చెలరేగిన శశికాంత్
RELATED ARTICLES