పంజాబ్ లక్ష్యం 151
మొహాలి: సన్‌రైజర్స్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన బ్యాట్‌ను ఝుళిపించాడు. ఫలితంగా సోమవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై వార్నర్ చివరివరకు అజేయంగా నిలిచి సన్‌రైజర్స్‌కు పారడగలిగే స్కోరును అందించాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడిన వార్నర్ (70 నాటౌట్; 62 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. విధ్వంసకర బ్యాట్స్‌మన్ జానీ బెయిరిస్టో (1) పరుగుకే పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మొహాలి పిచ్ స్వింగ్‌కు సహకరించడంతో ఇక్కడ పరుగులు చేయడం బ్యాట్స్‌మెన్స్‌కు ఇబ్బందిగా మారింది. ఈక్రమంలో విజయ్ శంకర్, వార్నర్‌లు సన్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించిన అనంతరం కుదురుగా ఆడుతున్న విజయ్ శంకర్ (26; 27 బంతుల్లో 2 ఫోర్లు) ఔటయ్యాడు. తర్వాత వచ్చిన మహ్మద్ నబీ (12) పరుగుల వద్ద రనౌట్ అవడంతో హైదరాబాద్ 80 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. తర్వాత మనీష్ పాండే (19)తో కలిసి వార్నర్ సన్‌రైజర్స్‌ను
ఆదుకున్నాడు. ఈక్రమంలోనే వార్నర్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఆఖరి వరకు ధాటిగా ఆడుతూ ఇతను 62 బంతుల్లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హూడా 3 బంతుల్లోనే 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 14 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 150/4 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో ముజీబుర్ రహ్మన్, షమీ, అశ్విన్ తలో వికెట్ తీశారు.
చెలరేగిన వార్నర్
RELATED ARTICLES