ఆడిలైడ్: ఆసీస్‌కు నాథన్ లియాన్ రూపంలో వారి శ్రమకు ఫలితం దక్కింది. కీలమైన ఇన్నింగ్స్ ఆడుతూ భారీ ఆధిక్యంవైపు దూసుకెళ్తున్న భారత్‌కు లియాన్ దెబ్బ తిశాడు. వరుసక్రమాల్లో వికెట్లు తీస్తూ టీమిండియాను కట్టడి చేయడంలో సఫలుడయ్యాడు. మొదట 204 బంతుల్లో 9 ఫోర్లతో 71 పరుగులు చేసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న చతేశ్వర్ పుజారాను పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ 234 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కీలకమైన 87 పరుగులు జోడించి భారత్‌కు భారీ ఆధిక్యాన్ని అందించారు. అనంతరం క్రీజులో అడుగుపెట్టిన రోహిత్ శర్మ(1)ను కేవలం ఒక పరుగు వద్దే ఔట్ చేసి లియాన్ భారత్‌కు మరో పెద్ద షాకిచ్చాడు. తర్వాత యువ ఆటగాడు రిషభ్ పంత్‌తో కలిసి రహానే భారత ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఒకవైపు రహానే సమన్వయంతో ఆడుతుంటే.. మరోవైపు పంత్ మాత్రం దూకుడుగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. వరుసగా మూడు ఫోర్లు ఒక సిక్స్ బాదిన పంత్‌ను చివరికి లియాన్ తన బుట్టలో వేసుకున్నాడు. వేగంగా ఆడిన పంత్ 16 బంతుల్లోనే 28 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో భారత్ 282 పరుగులు వద్ద ఆరో వికెట తర్వాత అదే జోరును కొనసాగించిన లియాన్ వచ్చిన వారిని వచ్చినట్టే పెవిలియన్ చేర్చాడు. ఇతని ధాటికి ఇషాంత్ శర్మ (0), మహ్మద్ షమీ (0) ఖాతా తెరువకుండానే వెనుదిరిగారు. చివర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న అజింక్యా రహానే 147 బంతుల్లో 7 ఫోర్లతో 70 పరుగులు చేసి లియాన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అశ్విన్ (5) వికెట్‌ను స్టార్క్ పడగొట్టడంతో భారత్ 106.5 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. విజృంభించి బౌలింగ్ చేసిన నాథన్ లియాన్ 6 వికెట్లు పడగొట్టాడు. ఇతని ధాటికి భారత్ చివరి ఐదు వికెట్లను కేవలం 25 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఇతర బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. హేజిల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కింది.