ప్రజాపక్షం/ధర్మపురి ముగ్గురు విద్యార్థులు ఈత కోసం వెళ్లి చెరువులో మునిగి చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామశివారులోని చెరువులో ఉదయం వేళలో ఈతకని వెళ్లి గోలుసుల యశాంత్ (12), పబ్బతి నవదీప్ (13), మారంపల్లి శరత్ (13) అనే విద్యార్థులు చెరువు నీటిలో మునిగి మృతి చెందారు. వీరిలో గోలుసుల యశాంత్ తల్లిదండ్రులు యాదాద్రి జిల్లా మోత్కూరి మండలం దాసారం గ్రామానికి చెందినవారు. బతుకు దెరువుకోసం తుమ్మెనాలలో నివాసం ఉంటున్నారు. మరో ఇద్దరు మారంపెళ్లి శరత్, పబ్బతి నవీన్‌లు తుమ్మెనాల గ్రామానికి చెందిన వారు. స్థానికంగా 5వతరగతి చదువుతున్న ముగ్గురు స్నేహితులు ఈత కోసం వెళ్లి చెరువులో నీట మునిగి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సంఘటనా స్థలాన్ని ధర్మపురి సిఐ బిల్లా కోటేశ్వర్ పరిశీలించారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగిత్యాల హాస్పిటల్‌కు తరలించారు.
చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం
RELATED ARTICLES